ఇక ముందు బర్త్ సర్టిఫికెట్ కంటే ముందుగానే పిల్లకు ఆధార్ నంబర్ అందించే విధంగా చర్యలు తెలుసుకోవాలని UIDAI బావిస్తోంది. అంటే, క్లియర్ గా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పసికందుకు తాత్కాలిక ఆధార్ నంబర్ ను వెంటనే నమోదు చేస్తుంది. అంతేకాదు, దీనికోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. అలాగే, తాత్కాలిక ఆధార్ నంబర్ ఇచ్చిన బిడ్డ కు 5 సంవత్సరాలు వచ్చిన తరువాత బయో మెట్రిక్స్ సేకరిస్తారు. దీనికోసం, తలితండ్రులు ఆధార్ సెంటర్ ని వెతుకుంటూ వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఆ పిల్లల ఇంటి వద్దనే బయోమెట్రిక్స్ సేకరిస్తారు.
అలాగే, ఆ బిడ్డకి 18 సంవత్సరాలు వచ్చిన తరువాత మరొకసారి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. పిల్లలు పుట్టిన నాటి నుండి సంబంధిత కుటుంబానికి ప్రభుత్వ పధకాలు నేరుగా అందేలా చూడ్డానికి ఈ చర్య తీసుకున్నట్లు అర్ధమవుతోంది. ఇదే కనుక జరిగితే పిల్లల ఆధార్ కార్డ్ కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగే శ్రమ కూడా ఉండదు.
ఎవరికైనా ఆధార్ కార్డ్ లో వారి అడ్రస్ తప్పుగా వచ్చినట్లయితే, వారు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే వాళ్లే సొంతంగా మార్చుకోవచ్చు. అది ఎలా చేయ్యాలో వివరంగా చూద్దామా.
ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి
ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది
దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు
ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి
మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది
మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది
ఇక్కడ Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి
ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి
తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు
OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి
అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.