aadhaar card biometric verification mandatory POM to TRAI full details on new sim card rules
Aadhaar Deadline: ఆధార్ యూజర్స్ కోసం కొత్త అప్డేట్ విడుదల చేసింది. ఎప్పటి కప్పుడు ఆధార్ అప్డేట్ ను నిర్వహించేలా ఆధార్ కార్డ్ హోల్డర్స్ కోసం అందించిన ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను 14 సెప్టెంబర్ 2024 తో ముగుస్తుందని UIDAI ముందుగా డేట్ అనౌన్స్ చేసింది. అయితే, ఇప్పుడు డేట్ ను పొడిగిస్తున్నట్లు కొత్త డేట్ ను ప్రకటించింది. ఇప్పుడు ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ 14 డిసెంబర్ 2024 వరకు పొడిగించినట్లు కొత్త డేట్ ను ప్రకటించింది.
10 సంవత్సరాలు నిండిన ఆధార్ కార్డ్ లను తప్పని సరిగా కొత్త వివరాలతో అప్డేట్ చేయాలని UIDAI యూజర్లను సూచించింది. ఈ అప్డేట్ కోసం వసూలు చేసే సాధారణ ఫీజును సైతం ఈ సర్వీస్ కోసం మాఫీ చేసింది. అంటే, ఆధార్ కార్డ్ తీసుకొని 10 సంవత్సరాలు పై బడిన ఆధార్ కార్డ్ హోల్డర్స్ వారి ఆధార్ ని అప్డేట్ చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన పనిలేదు. ఈ సర్వీస్ ను ఇప్పుడు ఈ ఉచిత సర్వీస్ ను మరొక నెల రోజులు పెంచింది.
ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను ఉపయోగించుకోవడానికి ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ సర్వీస్ ను ఉపయోగించవచ్చు. అయితే, ఆన్లైన్ సర్వీస్ ను మీ మొబైల్ లో నుంచి కూడా చేసుకోవచ్చు. దీనికిఒఎంసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, తగిన పేపర్స్ మరియు మీ ఫోన్ ఉంటే సరిపోతుంది.
ముందుగా మీ ఫోన్ లో https://uidai.gov.in/ సైట్ ను ఓపెన్ చేయండి లేదా mAadhaar యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. తర్వాత ఇందులో మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. వెబ్సైట్ లో అయితే My Aadhar ట్యాబ్ లోని ‘Document Update’ ను ఎంచుకోండి. ఇక్కడ Click Submit పైన నొక్కండి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మరియు ఇక్కడ అడిగిన వద్ద ఆధార్ నెంబర్, క్యాప్చా మరియు OTP తో లాగిన్ అవ్వండి.
తర్వాత ఇక్కడ అడ్రస్ వివరాలు అప్డేట్ చేయండి. మీరు అందించిన వివరాలు అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని వివరాలు సరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అడిగిన వద్ద మీ అడ్రస్ కి సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
Also Read: vivo X200 Series గ్లోబల్ లాంచ్ ప్రకటించిన కంపెనీ: ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే.!
ఈ సర్వీస్ ను UIDAI పూర్తిగా ఉచితంగా ఆఫర్ చేస్తుంది మరియు దీనికోసం మీరు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అయితే, ఈ ఉచిత సర్వీస్ కేవలం 14 డిసెంబర్ 2024 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది.