కరోనా మహామ్మారి సమయంలో భారతదేశంలోని వ్యాపారాలు మోసాలలో 46% శాతం పెరుగుదలను చూసినట్లు ఎక్స్పీరియన్స్ గ్లోబల్ ఇన్ సైట్స్ ఒక షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు, 90% శాతం మంది వ్యాపారాలు వివిధ ప్లాటుఫారం పైన వున్నా వినియోగధారులను గుర్తించడానికి కొత్త వ్యూహాలను కూడా అమలు చేసారని కూడా ఈ రిపోర్ట్ తెలిపింది.
ఈ రిపోర్ట్ యొక్క నివేదికలో, వేగవంతమవుతున్న డిజిటలైజేషన్ తో భారతదేశంలో ఆన్లైన్ మోసాలు మరియు ఆన్లైన్ ఆర్ధిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నట్లు పేర్కొంది. ఎక్స్పీరియన్స్ గ్లోబల్ ఇన్ సైట్స్ (జనవరి/ఫిబ్రవరి 2021) డేటా నుండి భారతదేశంలోని వ్యాపారాలు మోసాలలో 46% శాతం పెరుగుదలను చేసాయని తెలిపింది.
ముఖ్యంగా, ఇ-కామర్స్ రావడంతో డిజిటల్ ఫ్రాడ్స్ వ్యాపారాలకు భారీ సవాలుగా మారింది. ఫ్రాడ్స్ ప్రమాదం పెరుగుతున్నప్పటికీ, 40% భారతీయ వ్యాపారాలు ఈ ఫ్రాడ్స్ ను గుర్తించే కంటే వాటి ఆదాయ ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ నివేదిక సూచిస్తున్నాయి. ఇది నష్టాలు పెరగడానికి మరియు కస్టమర్ల విశ్వాసం క్షీణించడానికి దారితీస్తుంది.
భారతదేశంలో 56% మంది వినియోగదారులు ఆన్‌లైన్ ప్రైవసీని ఒక ముఖ్యమైన ఆందోళనగా పేర్కొన్నందున, వ్యాపారులు తమను మరియు తమ కస్టమర్లను సంభావ్య డిజిటల్ ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి బలమైన చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఈ నివేదిక తెలియపరిచింది.