భూమి వైపుగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

Updated on 29-Nov-2021
HIGHLIGHTS

NASA ఇటీవల ఒక కొత్త విషయాన్ని గురించి హెచ్చరించింది

ఈ గ్రహశకలం 77 మెగాటన్నుల TNTని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది

పెద్ద సైజులో ఉండే ఉల్కలు మాత్రం భారీ నష్టాన్ని కలిగిస్తాయి

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ఇటీవల ఒక కొత్త విషయాన్ని గురించి హెచ్చరించింది. ముందుగా, ఒక భారీ గ్రహశకలం భూమి కక్ష వైపుగా దూసుకొస్తునట్లుగా NASA హెచ్చరికలు జారీచేసింది. భూమి వైపుగా దూసుకొస్తున్న ఈ భారీ గ్రహశకలం బిగ్ బెన్ కంటే రెట్టింపు పరిమాణంలో ఉండడమేకాకుండా అణు విస్ఫోటనం అంత భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, అదృష్టవశాత్తూ ఈ భారీ గ్రహశకలం వలన భూమికి ఎటువంటి ప్రమాదం లేదని NASA వెల్లడించింది.

వాస్తవానికి, ఇంత పరిమాణంలో ఉండే ఉల్క ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందని కూడా అంచనాలను వేశారు. ఈ గ్రహశకలం 77 మెగాటన్నుల TNTని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మానవులు పరీక్షించిన కొన్ని పెద్ద అణువిస్ఫోటనాలతో పోలివుంటుంది. సరిగ్గా చెప్పాలంటే, ఇప్పటివరకూ పరీక్షించిన అణు విస్ఫోటనాలకంటే ఒకటిన్నర రెట్లు శక్తివంతమైనదిగా ఉంటుంది.        

భవిష్యత్తులో ఉల్కలు భూమిని ఢీకొంటే అవి ఎంతటి నష్టాన్ని కలిగించగలవు అనే దానిపైన సరైన అవగాన కోసం NASA వాటి శక్తిని గురించి అంచనాలు వేస్తుంది. గ్రహశకలాలు భూమిని ఢీకొనే అవకాశం ఎంత? ఆ ని అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే, చిన్న గ్రహశకలాలు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. కాబట్టి భూమిపైన వాటి ప్రభావం ఏమి ఉండదు. అయితే, పెద్ద సైజులో ఉండే ఉల్కలు మాత్రం భారీ నష్టాన్ని కలిగిస్తాయి.

అతి భారీ గ్రహశకలం ఢీకొని భూమి పైన డైనోసార్ జాతి అంతరించిన విషయం మనందరికీ తెలుసు. అందుకే, నాసా కూడా భవిశ్యత్తులో గ్రహశకలాలు ఢీకొట్టే విషయాన్ని తోసిపుచ్చదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :