క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 83 మూవీ OTT లో రిలీజ్ అవుతోంది

Updated on 22-Mar-2022
HIGHLIGHTS

1983 వరల్డ్ కప్ నేసథ్యంలో వచ్చిన 83 సినిమా

83 ఇప్పుడు OTT లో విడుదల కాబోతోంది

ఈ చిత్రం 2 OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది

భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్షణాలలో ఒకటి 1983 వరల్డ్ కప్. ఆనాటి మధురశృతులను అద్భుతమైన తీరుతో తెరకెక్కిచారు. ఈ సినిమా పేరును కూడా 1983 వరల్డ్ కప్ అర్ధం వచ్చేలా '83' గా పెట్టారు. ఇక సినిమా తారాగణం కూడా మంచి పేరున్న మరియు అద్భుతమైన నటన ప్రదర్శించ గల వారినే ఎంచుకున్నారు. కబీర్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనాటి టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ నటించగా, అతని భార్య పాత్రలో దీపికా పదుకొనే నటించారు. 83 సినిమా గురించి కంప్లీట్ గా ఇక్కడ తెలుసుకోండి.

వాస్తవానికి, ఈ చిత్రంలో నటి నటులు అద్భుతమైన నటన కనబరిచినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ నటించి మెప్పించిన 'పుష్ప' ది రైజ్ మరియు అదే సమయంలో విడుదలైన హాలీవుడ్ చిత్రం స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్. అందులోనూ ముఖ్యంగా, పుష్ప సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మరింతగా ఆకట్టుకోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే, క్రికెట్ క్రేజ్ ఎక్కువగా ఉన్న మన దేశంలో చారిత్రక క్రికెట్ ఘట్టాన్ని తెరకెక్కిచినా అంతగా ఆడకపోవడం ఆశ్చర్యకరమైన విషయంగానే చెప్పుకోవచ్చు.

1983 వరల్డ్ కప్ సమయంలో టీమ్ ఇండియా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది మరియు ఎలా కప్పును సొంతం చేసుకుందో ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు. క్రికెట్ ను ఇష్టపడే వారికీ ఈ సినిమా నిజంగా కన్నుల పండుగే అవుతుంది. ఈ చిత్రం 2 OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది. నివేదికల ప్రకారం, ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మరియు తెలుగు, తమిళ మరియు మలయాళ వెర్షన్‌ లను హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు.

ముందుగా, 83 మూవీని కేవలం సినిమా హాల్స్ లో మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఈ సినిమాకు ఆశించినంత విజయాన్ని సాధించక పోవడంతో, ఈ సినిమాను OTT ద్వారా దేశంలోని ప్రజలందరూ చూసి ఆనందించేలా చేయడానికి ప్రయత్నిస్తోంది   .

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :