2022 లో ఇండియాకి 5G: ముందుగా ఢిల్లీ తో సహా ఈ సిటీలకు చేరనుంది

Updated on 28-Dec-2021
HIGHLIGHTS

సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ఎట్టకేలకు ఇండియాలో 5G సర్వీస్

ఈ మహా నగరాలను 5G సర్వీస్ తాకబోతున్నాయి

భారత ప్రభుత్వం ‘స్వదేశీ 5G టెస్ట్ బెస్ట్ ప్రాజెక్ట్’ను కూడా ప్రారంభించింది

సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ఎట్టకేలకు ఇండియా 5G సర్వీస్ లను అందుకోనునట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, గురుగ్రామ్, బెంగళూరు, చండీగఢ్, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పూణే మరియు గాంధీనగర్ వంటి నగరాలను 5G సర్వీస్ తాకబోతున్నాయి.

జనవరి నెలలో ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో ప్రదర్శించింది. అదే విధంగా ఈ ఏడాది జూన్‌లో గురుగ్రామ్ లో కూడా ఎయిర్‌టెల్ 5G ట్రయల్స్ ప్రారంభించింది. కాబట్టి, దేశంలోని ప్రధాన నగరాల్లో 5G పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

భారత ప్రభుత్వం ‘స్వదేశీ 5G టెస్ట్ బెస్ట్ ప్రాజెక్ట్’ను కూడా ప్రారంభించింది. ఇది దేశంలో 5G సేవలను పరీక్షించడం మరియు అభివృద్ధి చేయడంలో IIT బాంబే, ఢిల్లీ వంటి ఏజెన్సీలు సహకరించేలా చూస్తుంది. అంతేకాదు, టెలికాం శాఖ 5G స్పెక్ట్రమ్‌ను టెలికాం దిగ్గజాలైన  భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా మరియు MTNLలకు 5G ట్రయల్స్ కోసం కేటాయించింది.

ఇక 5G గురించి మాట్లాడితే, 4 జి నెట్వర్క్  సైద్ధాంతిక పరంగా సెకనుకు 100 మెగాబిట్స్ (Mbps) వేగంతో ఉంటే, 5 జి విషయంలో మాత్రం మనం ఊహించని విధంగా ఇది సెకనుకు గరిష్టంగా 10 గిగాబిట్స్ (Gbps) తో వేగంతో ఉంటుంది. అంటే, 5 జి ప్రస్తుత 4 జి టెక్నాలజీ కంటే ఏకంగా వంద రెట్లు వేగంగా ఉంటుంది. ఉదాహరణకు, కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ యొక్క నివేదిక తెలిపిన ప్రకారం, మీరు 5G లో కేవలం 3.6 సెకన్లలో డౌన్లోడ్ చేసే పనిని, 4G లో అయితే 6 నిమిషాలు, 3G లో అయితే 26 గంటల డౌన్‌లోడ్ సమయం పడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :