భారతీయ e-స్కూటర్ తయారీ కంపెనీ Okinawa ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ OKHI-90 ని ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 85-90 kmph టాప్ స్పీడ్ తో ప్రయాణించే శక్తిని కలిగి వుంది. ఈ e-స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 160 కిలోమీటర్ల వరకూ ప్రయానించగలదని కూడా కంపెనీ పేర్కొంది. అంతేకాదు, మీరు పూర్తి రైడ్ ను ఆస్వాదించడానికి వీలుగా అనేక ఫీచర్లను కలిగి ఉన్న Okinawa Connect యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల కంటే OKHI-90 చాలా భిన్నంగా ఉందని చూడగానే అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ లేటెస్ట్ e-స్కూటర్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
ఒకినావా ఓఖీ-90 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ రూ.1,21,866 (ఎక్స్-షోరూమ్ ధర) ధరతో విడుదల చేసింది. అయితే, రాష్ట్రాన్ని బట్టి అక్కడ ఉన్న సబ్సిడీని బట్టి ఈ ధరలో మార్పు ఉంటుంది. ఉదాహరణకు: ఓఖీ 90 ఢిల్లీ మరియు మహారాష్ట్రలో దాదాపు రూ. 1,03,866 ధరకు అందించబడుతోంది. అలాగే, ఇతర రాష్ట్రల్లో అక్కడి సబ్సిడీని బట్టి ధర లో మార్పు ఉంటుంది.
Oakhi-90 ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న చాలా ఎలక్ట్రిక్ వాహనాల నుండి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది మరియు వినియోగదారులకు డబ్బుకు తగిన ఫీచర్లను అందిస్తుంది. ఇది వెడల్పాటి మరియు గ్రిప్పీ టైర్లు మరియు పెద్ద సౌకర్యవంతమైన సీటుతో భారతీయ కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. OKHI-90 ఇన్-బిల్ట్ నావిగేషన్, డిజిటల్ ఇన్ఫర్మేటివ్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ ఛార్జింగ్ USB-పోర్ట్, లగేజ్ బాక్స్ లైట్, జియో-ఫెన్సింగ్, సురక్షిత పార్కింగ్ మొదలైన చాలా ఉపయోగకరమైన మరియు గొప్ప ఫీచర్లతో వస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకవేళ ఎవరైనా దొంగిలిస్తే దాన్ని ఆఫ్ చేసేలా కూడా Okinawa Connect యాప్ మీకు సహాయపడుతుంది. OKHI-90 అనేది ఒక అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది సెంట్రల్ మౌటింగ్ చేయబడిన 3800W మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఓఖీ-90 రెండు డ్రైవింగ్ మోడ్స్ లో వస్తుంది. అందులో, ఒకటి Eco Mode మరియు రెండవది Sports Mode, వీటిలో ఎకో మోడ్ లో 55-60 కిలోమీటర్ల వేగంతో స్పోర్ట్స్ మోడ్ లో 80-90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 10 సెకన్లల్లోనే 0-90 Kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది.