Single OTT: శ్రీవిష్ణు హ్యూమర్ తో తెగ నవ్వించిన సింగిల్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.!

Updated on 06-Jun-2025
HIGHLIGHTS

శ్రీవిష్ణు హ్యూమర్ తో తెగ నవ్వించిన సింగిల్ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది

శ్రీవిష్ణు కి తోడు వెన్నెల కిషోర్ మరింత నవ్వులు పండించారు

ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది

Single OTT: శ్రీవిష్ణు హ్యూమర్ తో తెగ నవ్వించిన సింగిల్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. నిజానికి ఇది రొమాంటిక్ కామెడీ మూవీ అయినా ఎప్పటిలాగానే శ్రీవిష్ణు తనదైన హ్యూమర్ తో మంచి కామెడీ పండించారు. శ్రీవిష్ణు కి తోడు వెన్నెల కిషోర్ మరింత నవ్వులు పండించారు. ఈ సినిమాలో కేతిక శర్మ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది.

Single OTT: ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది?

సింగిల్ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్ లో చూడలేక మిస్సైన వారు అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ రొమాన్స్ కామెడీ సినిమాని చూడవచ్చు.

Also Read: Poco F7: పోకో అప్ కమింగ్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన పోకో.!

సింగిల్ సినిమా కథ:

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది కూడా టిపికల్ ట్రయాంగిల్ సినిమా కథే అని చెప్పాలి. బ్యాంకు లో ఇన్సూరెన్స్ సెక్షన్ లో పని చేసే ఎంప్లాయి (శ్రీ విష్ణు) ఆడీ కారు షోరూమ్ లో పని చేసే కేతిక సేల్స్ ఉమెన్ పూర్వ (కేతిక శర్మ) ను ప్రేమిస్తాడు. అయితే, పూర్వ ని ప్రేమలో దించే ప్రాసెస్ లో అనుకుండా హరిణి (ఇవానా) ని ఇంప్రెస్ చెస్తాడు. అయితే, తను ప్రేమించిన అమ్మాయిని ప్రేమలో దించే ప్రొసెస్ లో తను (శ్రీవిష్ణు) పూర్వ ని మోసం మోసం చేస్తాడు. అయితే, తాను ఎలాగైతే పూర్వ ని మోసం చేస్తాడో అదే విధంగా హరిణి చేతిలో మోసపోతాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

శ్రీవిష్ణు హ్యూమర్ మరియు వెన్నెల కిషోర్ మేనరిజం తో ఈ సినిమా మొత్తం నవ్వుల పువ్వులు పూయించారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :