Pushpa 2 First Single: ఆరు భాషల్లో ‘నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే’ సాంగ్ రిలీజ్.!

HIGHLIGHTS

Pushpa 2 First Single సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది

'పుష్ప పుష్ప' పేరుతో హోరెత్తించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Pushpa 2 First Single: యావత్ భారతదేశం ‘పుష్ప రాజ్’ పేరుతో హోరెత్తించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా Pushpa (The Rise) యొక్క సెకండ్ పార్ట్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా కొత్త అప్డేట్ లను అందించడం కూడా మొదలు పెట్టింది. పుష్ప 2 ఫస్ట్ సింగిల్, ‘నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే’ ఫస్ట్ సాంగ్ ను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ ఆరు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసింది.

Pushpa 2 First Single:

Pushpa 2 First Single

పుష్ప మూవీ ఇండియా మాస్ సెన్సెషన్ మూవీ గా నిలవడం మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ యాక్టింగ్ కి యావత్ దేశాన్ని ఫిదా అయ్యేలా కూడా చేసింది. పుష్ప 2 (పుష్ప పుష్ప) పైన ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్, ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ తో అభిమానులను ఖుషి చేసింది.

4:19 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటను T-Series యొక్క అన్ని అధికారిక Youtube ఛానల్స్ నుంచి రిలీజ్ చేసింది. ఈ పాట మొత్తం కూడా పుష్ప, పుష్ప, పుష్ప పేరుతో హోరెత్తిపోయింది. ఈ పాటను 6 భాషల్లో కూడా Lyrical సాంగ్ గా విడుదల చేసింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ కొత్త స్టెప్స్ మరియు స్టైల్, అభిమానుల కన్నుల పండుగ చేశాయి.

Also Read: BSNL: రూ. 49 కే OTT లాభాలను ఆఫర్ చేస్తున్న ప్రభుత్వ సంస్థ.!

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :