national awards 2025 best telugu films
సినిమా ఇండస్ట్రీ అతిపెద్ద అవార్డు ప్రదానం కోసం National Film Awards 2025 లిస్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి ఎక్కువ పేర్లు నమోదు అయ్యాయి. కేవలం పేర్లు నమోదు చేయడమే కాదు ఎక్కువ విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు నటనతో ప్రాణం పోసిన ‘భగవంత్ కేసరి’ మరియు వినూత్నమైన కథ మరియు ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ‘హనుమాన్’ ఉన్నాయి. ఇవి కాకుండా లిరిక్స్ మొదలు కొని గానం వరకు చాలా రంగాల్లో మన తెలుగు వారు ఈసారి విన్నర్స్ గా నిలిచారు.
ఇక అవార్డ్స్ అందుకున్న సినిమాలు మరియు ఆ అవార్డు అందుకోవడానికి వారు అందించిన సేవ విషయానికి వస్తే, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ సినిమా అవార్డు అందుకుంది. సమాజానికి మంచి సందేశాన్ని అందించే కథాంశంతో అనిల్ రావిపూడి తీసుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డు అందుకుంది. 2023 లో విడుదలై గొప్ప కలక్షన్స్ సాధించడమే కాకుండా నందమూరి బాలకృష్ణ నటనతో ప్రజల ప్రేమను చోరగొంది. అయితే, ఈ సినిమా 2025 సంవత్సరంలో తగిన ప్రతిఫలాన్ని అందుకుంది.
ఇండియన్ సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తో వచ్చిన ‘హనుమాన్’ రెండు అవార్డులు కైవసం చేసుకుంది. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ మరియు మరియు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ రెండు అవార్డులు అందుకుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ మరియు కామిక్స్ (AVGC) విభాగంలో ఈ సినిమా ఈ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా దేశవాప్తంగా గొప్ప కలెక్షన్స్ సాధించడమే కాకుండా యావత్ దేశాన్ని షేక్ చేసింది.
కేవలం బెస్ట్ సినిమా కోసం మాత్రమే కాదు ఈసారి మరిన్ని విభాగాల్లో మన తెలుగు వారు అవార్డ్స్ అందుకున్నారు. గొప్ప పల్లెటూరు కథాంశం మరియు సహజమైన రీతిలో చిత్రించబడి తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ‘బలగం’ సినిమా కూడా అవార్డు అందుకుంది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట రాసిన ‘కాసర్ల శ్యామ్’ 2025 ఉత్తమ గీత రచయిత అవార్డు గెలుచుకున్నారు.
అలాగే, ఈసారి చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో కూడా మన వారికి గౌరవం దక్కింది. ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో చేసిన అద్భుతమైన నటనకు గాను చైల్డ్ ఆర్టిస్ట్ ‘సుకృతి వేణి బండ్రెడ్డి’ 2025 ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకున్నారు.
Also Read: అమెజాన్ GFF Sale: భారీ డిస్కౌంట్ తో జస్ట్ 5 వేలకే లభిస్తున్న boAt Dolby సౌండ్ బార్.!
నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను అద్దం పట్టేలా చూపించి అందరి మన్ననలు అందుకున్న ‘బేబీ’ సినిమా కూడా రెండు అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాలో బాగా హిట్ అయిన ‘ప్రేమిస్తున్నా’ పాట పాడిన PVN S రోహిత్ 2025 ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ గెలుచుకున్నారు. అలాగే, బెస్ట్ స్క్రీన్ ప్లే కలిగిన సినిమాగా ‘బేబీ’ సినిమా 2025 బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకుంది.