Andhra King Taluka OTT release date update
Andhra King Taluka OTT: రామ్ పోతినేని మాస్ ఎంటర్టైనర్ సినిమా “ఆంధ్రా కింగ్ తాలూకా” ఓటిటీ రిలీజ్ గురించి ఇప్పుడు నెట్టింట్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. నవంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే, ప్రస్తుతం హిట్ సినిమాలు సైతం విడుదలైన నెల రోజులకే ఓటిటీ అడుగుపెడుతున్నాయి. అందుకే, ఈ సినిమా ఓటీటీ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా‘ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ఓటిటీ లో విడుదల అయ్యే అవకాశం ఉందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను Netflix సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఇది నోటి మాటగా మాత్రమే చూడాల్సి వస్తుంది.
ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన చిత్రం మరియు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. ముఖ్యంగా, రామ్ పోతినేని మేనరిజానికి తగిన విధంగా హీరో పాత్రకు ఇచ్చిన పవర్ ఫుల్ డిజైనింగ్ మరియు గ్రామీణ నేపథ్యంలోని ఘర్షణలు ఈ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమాలో రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటన మరియు భాగ్యశ్రీ గ్లామర్ ఈ సినిమాకి హైలెట్ అవుతాయి.
వాస్తవానికి, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా థియేటర్స్ వద్ద మంచి టాక్ అందుకుంది. అయితే, ఈ సినిమా ఆశించిన విషయాన్ని సాధించలేక పోయిందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా దాదాపు 30 కోట్లు వసూలు చేసిందని టాక్ వుంది. అయితే, ఈ సినిమా అందుకున్న పాజిటివ్ టాక్ తో మరింత వసూళ్లు చేయడమే కాకుండా హాట్ కావడానికి ఆస్కారముంది. అయినా కూడా ఈ సినిమా ఆ స్థాయిలో హిట్ కాకపోవడానికి తగిన కారణాలు మాత్రం తెలియలేదు.
Also Read: BSNL Super Plan: చవక ధరలో భారీ డేటా అందించే అన్లిమిటెడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది.!
మరి థియేటర్ నుంచి OTT ధరలో ఉన్న ఈ రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీ లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.