zebronics 7 1 2 dolby atmos soundbar today available at lowest price ever
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైం చవక ధరలో లభిస్తోందంటే మీరు నమ్ముతారా? ఇది నిజంగా నిజమండీ బాబు. ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మునుపెన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ జెబ్రోనిక్స్ ప్రీమియం సౌండ్ బార్ ను 10 వేల రూపాయల భారీ తగ్గింపు ధరలో ఈరోజు అందుకోవచ్చు.
జెబ్రోనిక్స్ Juke Bar 9920 7.1.2 డాల్బి అట్మాస్ సౌండ్ బార్ ను ఇండియాలో రూ. 32,999 రూపాయల ప్రైస్ తో గత సంవత్సరం విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు కూడా ఇదే దరతో సేల్ అయ్యింది. అయితే, ఏదైనా బిగ్ సేల్ అనౌన్స్ ఐతే మాత్రం ఈ సౌండ్ బార్ 27 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యేది. అయితే, ఈరోజు ఇంకా 4 వేల రూపాయల డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తుంది.
ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన రూ. 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 23,499 రూపాయల ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Vivo V70 FE: రేపు విడుదలయ్యే వివో ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ లీకయ్యాయి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కేవలం బార్ మరియు సబ్ ఉఫర్ తో మాత్రమే వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ కలిగిన గొప్ప సరౌండ్ స్పీకర్ సెటప్ తో ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపుతుంది. ఎందుకంటే, ఇది 7.1.2 టోటల్ సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన బార్ లో 9 స్పీకర్లు ఉంటాయి.
ఈ సెటప్ లో ముందు వైపు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, పైన 4 అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ తో పాటు రెండు వైపులా సైడ్ లో రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇది గొప్ప సరౌండ్ అందించే స్పీకర్ సెటప్ తో ఇంటిని పూర్తిగా సౌండ్ తో ఫీల్ చేస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ తో వచ్చే 12 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఇంటిని షేక్ చేసే జబర్దస్ బాస్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 900W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది పెద్ద సైజు హల్ ను సైతం సౌండ్ తో షేక్ చేసే సౌండ్ బార్. అదనంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ తో పాటు జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన ZEB Acoustics Max మల్టీ డైమెన్షనల్ సౌండ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ అన్ని ఫీచర్స్ తో ఇది మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చేస్తుంది. ఇది HDMI (ARC), ఆప్టికల్ ఇన్, USB , AUX, మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.