Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఈరోజు మిస్సయితే మళ్ళీ దొరకదు.!

HIGHLIGHTS

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్

ఈరోజు మిస్సయితే మళ్ళీ దొరకదేమో అనేంత గొప్ప డీల్

ఈ సౌండ్ బార్ గతంలో ఎన్నడూ చూడనంత చవక ధరలో ఈరోజు లభిస్తుంది

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఈరోజు మిస్సయితే మళ్ళీ దొరకదేమో అనేంత గొప్ప డీల్స్ అందుకుంది. ప్రీమియం స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మోస్ ప్రీమియం సౌండ్ టెక్నాలజీతో జెబ్రోనిక్స్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ప్రైస్ కట్ మరియు మరో రెండు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ లను ఈ సౌండ్ బార్ పై ఆఫర్ చేసింది. ఈ మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ గతంలో ఎన్నడూ చూడనంత చవక ధరలో ఈరోజు లభిస్తుంది.

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Juke Bar 9920 పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఇండియన్ మార్కెట్లో రూ. 32,999 రూపాయల ధరలో విడుదలైన ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఏకంగా రూ. 8,000 రూపాయల ప్రైస్ కట్ విధించి కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది.

కేవలం ప్రైస్ కాం మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై 7% తగ్గింపు అందించే కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ పై రూ. 1,749 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను Kotak, HSBC మరియు IndusInd బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ ఈరోజు అమెజాన్ కేవలం రూ. 22,000 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: ఫ్రాడ్ మరియు స్కామ్ లకు చెక్ పెట్టడానికి Online Payment చెల్లింపు గంట జాప్యం కోసం RBI కొత్త ప్రతిపాదన.!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది జెబ్రోనిక్స్ యొక్క ప్రీమియం సౌండ్ బార్ మరియు ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇందులో, 7.1.2 ఛానల్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే వార్ పైన అప్ ఫైరింగ్, ముందు ఫ్రంట్ ఫైరింగ్ మరియు సైడ్ లో కూడా సైడ్ ఫైరింగ్ స్పీకర్ కూడా ఉంటాయి. ఇది సినిమా థియేటర్ వంటి సరౌండ్ సౌండ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ తో గ్రౌండ్ షేకింగ్ బాస్ సౌండ్ అందించే 12 ఇంచ్ హెవీ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఇది టోటల్ 900W హెవీ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ మరియు ZEB Acoustics Max మల్టీ డైమెన్షనల్ సౌండ్ సపోర్ట్ తో జతగా వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా, ఇందులో HDMI (ARC), AUX, ఆప్టికల్ ఇన్, USB తో పాటు బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :