Redmi Beat Drop: కొత్త ఇయర్ ఫోన్స్ లాంచ్ చేయనున్న షియోమి

HIGHLIGHTS

షియోమి సంస్థ, ఇటీవల తన Redmi 9A స్మార్ట్ ఫోనుతో పాటుగా Redmi Earphones ని కూడా విడుదల చేసింది.

షియోమి మరొక సరికొత్త ఇయర్ ఫోన్ లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది.

ఈ ఇయర్ ఫోన్స్ ని #RedmiBeatDrop పేరుతో టీజ్ చేస్తోంది.

షియోమి సంస్థ, ఇటీవల తన Redmi 9A స్మార్ట్ ఫోనుతో పాటుగా Redmi Earphones ని కూడా విడుదల చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ ని కేవలం రూ .399 తక్కువ ధరతో లాంచ్ చేసింది. అయితే, మరొక సరికొత్త ఇయర్ ఫోన్ లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ ని #RedmiBeatDrop పేరుతో టీజ్ చేస్తోంది. ఈ ఇయర్ ఫోన్స్ ని సెప్టెంబర్ 30 వ  తేదికి లాంచ్ చేయనుంది.      

ఇక ఇటీవల షియోమి మార్కెట్లో విడుదల చేసిన అలాగే, Redmi Earphones విషయానికి వస్తే, ఈ ఇయర్ ఫోన్స్ తక్కువ బరువు వస్తాయి మరియు మంచి సౌండ్ అందిస్తుంది. అధికమైన BASS కోరుకునేవారికి ఈ ఇయర్ ఫోన్స్ సరిగ్గా సరిపోతాయి.  

షియోమి BASS ని పెంచే లక్ష్యంతో డైనమిక్ డ్రైవ్‌ లతో ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్ ‌లను ప్రకటించింది. ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్స్ ‌లో మైక్రోఫోన్ మరియు మినీ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ ఇయర్ ‌ఫోన్స్ ‌లో అల్యూమినియం మిశ్రమం నిర్మించబడింది మరియు 13 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అలాగే, ఈ రెడ్మి ఇయర్ ఫోన్స్ ఎంచుకోవడానికి మూడు రంగులలో వస్తాయి – ఎరుపు, నలుపు మరియు నీలం.

ఇక ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్స్ ధర విషయానికి వస్తే, భారతదేశంలో దీనిని కేవలం 399 రూపాయల తక్కువ ధరకే ప్రకటించింది. ఫ్లిప్ ‌కార్ట్, అమెజాన్ ఇండియా మరియు ఆఫ్‌ లైన్ రిటైల్ దుకాణాల్లో అమ్ముడవుతోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :