Redmi Earphones: షియోమి అతి తక్కువ ధరకే విడుదల చేసింది

HIGHLIGHTS

షియోమి తన Redmi 9A స్మార్ట్ ఫోనుతో పాటుగా రెడ్‌మి ఇయర్‌ఫోన్స్ ని కూడా ఇండియాలో విడుదల చేసింది.

Redmi Earphones ని భారతదేశంలో కేవలం రూ .399 తక్కువ ధరతో లాంచ్ చేసింది. ఈ

అధికమైన BASS కోరుకునేవారికి ఈ Xiaomi Redmi Earphones సరిగ్గా సరిపోతాయి.

షియోమి తన Redmi 9A స్మార్ట్ ఫోనుతో పాటుగా రెడ్‌మి ఇయర్‌ఫోన్స్ ని కూడా ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ ని భారతదేశంలో కేవలం రూ .399 తక్కువ ధరతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ తక్కువ బరువుతో వున్నా కూడా  మంచి సౌండ్ అందిస్తుంది. అధికమైన BASS కోరుకునేవారికి ఈ ఇయర్ ఫోన్స్ సరిగ్గా సరిపోతాయి.   

షియోమి BASS ని పెంచే లక్ష్యంతో డైనమిక్ డ్రైవ్‌ లతో ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్ ‌లను ప్రకటించింది. ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్స్ ‌లో మైక్రోఫోన్ మరియు మినీ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ ఇయర్ ‌ఫోన్స్ ‌లో అల్యూమినియం మిశ్రమం నిర్మించబడింది మరియు 13 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అలాగే, ఈ రెడ్మి ఇయర్ ఫోన్స్ ఎంచుకోవడానికి మూడు రంగులలో వస్తాయి – ఎరుపు, నలుపు మరియు నీలం.

ఇక ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్స్ ధర విషయానికి వస్తే, భారతదేశంలో దీనిని కేవలం 399 రూపాయల తక్కువ ధరకే ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుండి ఫ్లిప్ ‌కార్ట్, అమెజాన్ ఇండియా మరియు ఆఫ్‌ లైన్ రిటైల్ దుకాణాల్లో అమ్మకాలను ప్రారంభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :