Truke buds Q1 Lite launching soon in India
బడ్జెట్ ధరలో గొప్ప ప్రోడక్ట్స్ ను లాంఛ్ చేస్తున్న బ్రాండ్ గా యూజర్ల మన్నలను అందుకున్న Truke బ్రాండ్ కొత్త బడ్స్ ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్రూక్ అప్ కమింగ్ బడ్స్ ను Truke buds Q1 Lite పేరుతో లాంఛ్ చేస్తున్నట్లు తెలిపింది. ట్రూక్ ఈ బడ్స్ ను కొత్త రాయల్ లుక్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ బడ్స్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కూడా పూర్తిగా వెల్లడించింది. ఈ అప్ బడ్స్ ఎటువంటి ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కలిగి ఉన్నదో ఒక లుక్కేద్దాం పదండి.
ట్రూక్ అప్ కమింగ్ బడ్స్ ను రాయల్ ఎలిగాన్స్ డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ బడ్స్ ను ‘Coming Soon’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది. త్వరలో రానున్న ఈ బడ్స్ ను క్రిస్టల్ క్లియర్ కాల్స్ కోసం క్వాడ్ మైక్ లను అడ్వాన్స్ ENC ఫీచర్ తో అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బడ్స్ లో 48 గంటల ప్లేటైమ్ అందించే లాంగ్ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఇయర్ బడ్స్ ను డ్యూయల్ టోన్ క్రోమ్ కలర్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో 40ms అల్ట్రా లో లాటెన్సీ గేమింగ్ మోడ్ ఫీచర్ వుంది. ఈ బడ్స్ ఫుల్ టచ్ ఫంక్షన్స్ మరియు గొప్ప కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 12.4 టైటానియం స్పీకర్స్ తో True Deep Bass సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: విడుదలకు ముందే Samsung Galaxy M15 5G రేటు మరియు కంప్లీట్ స్పెక్స్ రివీల్ చేసింది.!
ఈ ట్రూక్ అప్ కమింగ్ బడ్స్ 10 నిముషాల ఛార్జ్ తో 100 మినిట్స్ ప్లేటైమ్ అందించ గల ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే, ఈ అప్ కమింగ్ బడ్స్ ను లేటేస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు మంచి సౌండ్ అందించగల స్పీకర్లతో పాటు గొప్ప డిజైన్ తో తీసుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.