todays best budget 5.1 ch soundbar deals on flipkart Freedom Sale
ఫ్లిప్ కార్ట్ ఈరోజు మళ్ళీ Freedom Sale ని ప్రారంభించింది. ఆగస్టు 15 పండుగ సందర్భంగా ఈ కొత్త సేల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చింది. ఈ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు అందించింది. ఇందులో నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్స్ అందిస్తున్నాను. 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ సౌండ్ బార్ డీల్స్ పరిశీలించవచ్చు.
ఈరోజు రెండు 5.1 ఛానల్ సౌండ్ బార్స్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తున్నాయి. ఇందులో Juke Bar 7450 PRO సౌండ్ బార్ మరియు GOSURROUND 945 రెండు సౌండ్ బార్ ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ పై అందించిన ఆఫర్లు మరియు ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,499 ధరలో లభిస్తుంది. ఇదే కాదు, ఈ సౌండ్ బార్ ని ICICI, HDFC మరియు BOBCARD EMI క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 549 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,950 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 చానల్ సెటప్ తో అవస్తుంది మరియు టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇది ,HDMI(ARC), USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Digital Freedom: దేశ పురోగతికి కొత్త అర్థం చెబుతున్న AI స్టార్టప్స్
ఈ గోవో సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది, ఇందులో మూడు 2 ఇంచ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ గోవో సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు మంచి డిజైన్ తో ఆకట్టుకుంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ AUX, USB మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో HDMI కనెక్టివిటీ లేకపోవడం పెద్ద లోతుగా చెప్పొచ్చు. కానీ, బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ గా నిలుస్తుంది.