TCL వైర్‌లెస్ సబ్‌ వూఫర్‌తో కొత్త సౌండ్‌బార్‌ను విడుదల చేసింది

HIGHLIGHTS

TCL భారతదేశంలో కొత్త సౌండ్‌బార్‌ను విడుదల చేసింది.

కొత్త TCL సౌండ్‌బార్‌ బ్లూటూత్ 5.0, HDMI Arc, ఆప్టికల్ పోర్ట్ మరియు మరిన్ని అప్షన్లను తెస్తుంది.

TCL TS3015 సౌండ్‌బార్ 180W సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది

TCL వైర్‌లెస్ సబ్‌ వూఫర్‌తో కొత్త సౌండ్‌బార్‌ను విడుదల చేసింది. ఈ కొత్త TCL సౌండ్‌బార్‌ బ్లూటూత్ 5.0, HDMI Arc, ఆప్టికల్ పోర్ట్ మరియు మరిన్ని అప్షన్లను తెస్తుంది. ఇది 180W సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది. అలాగే, సబ్‌ వూఫర్‌ను కేబుల్ ద్వారా సౌండ్‌బార్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇది వైర్‌లెస్‌గా సౌండ్‌బార్ తో కనెక్ట్ అవుతుంది. ఈ TCL సౌండ్‌బార్ మోడల్ నంబర్ TS3015  మరియు ఇది రూ .8,999 రుపాయల ధరతో ప్రకటించబడింది.  

TCL TS3015 సౌండ్‌బార్ ధర మరియు లభ్యత

పైన చెప్పినట్లుగా, ఈ TCL సౌండ్‌బార్ ధర రూ .8,999 మరియు ఆన్‌లైన్‌లో లభిస్తుంది.

TCL TS3015 సౌండ్‌బార్ ఫీచర్లు

ఈ TCL సౌండ్‌బార్ 2.1 సెటప్ మరియు వైర్‌లెస్‌ సబ్‌ వూఫర్ తో సౌండ్ బార్ కి అనుసంధానించబడుతుంది. ఇది 180W సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది. ఈ సౌండ్‌బార్ కాంపాక్ట్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇది వాల్యూమ్, బాస్ మరియు ట్రెబెల్ వంటి వాటిని నియంత్రించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది అంతర్నిర్మిత FM రేడియోను కలిగి లేదు. కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే, ఈ సౌండ్‌బార్‌లో USB పోర్ట్, HDMI Arc, ఆప్టికల్ ఇన్, AUX in మరియు బ్లూటూత్ 5.0 ఉన్నాయి. ఈ సౌండ్‌బార్ యొక్క బ్లూటూత్ పరిధి 10 మీటర్లు.

మొత్తం ప్యాకేజింగ్‌లో, సౌండ్‌బార్‌తో పాటు, మీకు సబ్‌ వూఫర్, రిమోట్, Rca 3.5 ఎంఎం కేబుల్ మరియు వాల్ మౌంట్ కిట్ లభిస్తాయి. సౌండ్‌బార్ లోపల డ్రైవర్లు 2-అంగుళాలు కొలతలను కలిగి ఉంటాయి, సబ్‌ వూఫర్‌లో 5.25-అంగుళాల డ్రైవర్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :