రూ. 4,000 ధరలో లభించే బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.!

రూ. 4,000 రూపాయల బడ్జెట్ లో కొత్త సౌండ్ బార్ కొనాలని ఆప్షన్ ల కోసం వెతుకుతుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. ఈరోజు అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి Soundbar Deals అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం. మంచి సౌండ్, మల్టీ కనెక్టివిటీ మరియు గొప్ప డిజైన్ కలిగిన బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.

Soundbar Deals

ఈరోజు అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో మూడు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు చుద్దాం.

ZEBRONICS Juke BAR 3903

ఆఫర్ ధర : రూ. 3,799

జెబ్రోనిక్స్ యొక్క ఈ 80W సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 46% భారీ డిస్కౌంట్ తో రూ. 3,799 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 50W BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, ఆక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here

GOVO GoSurround 925

ఆఫర్ ధర : రూ. 4,999

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 72% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో 200W పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HMDI Arc, ఆక్స్, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ తో సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: BSNL: నెలకు రూ. 100 ఖర్చుతోనే కాలింగ్ మరియు డేటా అందించే సాటిలేని ప్లాన్ ఇదే.!

boAt Aavante Bar 1500 Pro

ఆఫర్ ధర : రూ. 4,999

బోట్ యొక్క ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 ధరకే లభిస్తోంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ ఆప్టికల్, ఆక్స్, HDMI Arc మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :