Sony 3.1.2 Dolby Atmos latest soundbar available with big discount on amazon
Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. బ్రావియా స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ గా సోనీ ఇదే నెలలో విడుదల చేసిన ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి తక్కువ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ బాస్ సౌండ్ తో పాటు థియేటర్ ని మరిపించే సూపర్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
సోనీ లేటెస్ట్ గా విడుదల చేసిన Theatre HT-BD60 సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ప్రైమ్ డే సేల్ ముగిసిన తర్వాత ఈ సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ప్రైస్ తో యూజర్ల కోసం ఆఫర్ చేయడం విశేషం. ఈ సౌండ్ బార్ సోనీ అఫీషియల్ సైట్ నుండి Rs.54,990 ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఇదే సౌండ్ బార్ ను 31% భారీ డిస్కౌంట్ తో రూ. 37,989 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ ను ఇంకా తక్కువ ధరలో అందుకోవడానికి వీలుగా రూ. 2,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సోనీ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి ఏదైనా బ్యాంక్ కార్డు తో పేమెంట్ చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే మీ బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 35,989 రూపాయలకే లభిస్తుంది. ఆఫర్ ప్రైస్ చెక్ చేయడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Samsung Galaxy F36 5G: AI కెమెరా ఫోన్ లాంచ్ చేస్తున్న శామ్సంగ్.!
ఈ సోనీ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను సరికొత్త సెటప్ తో సోనీ అందించింది. ఇందులో ముందు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 350 W సౌండ్ అవుట్ పుట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ బెస్ట్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇందులో, Dolby, డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ట్రూ HD, Dolby Atmos, DTS, డిటిఎస్ HD, డిటిఎస్ HD మాస్టర్ ఆడియో, DTS:LPCM వంటి మల్టి సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా సోనీ యొక్క ప్రత్యేకమైన డిజిటల్ యాంప్లిఫైయర్ మరియు S – మాస్టర్ లను కూడా ఇందులో అందించింది.
ఈ సౌండ్ బార్ HDMI (CEC/eArc), ఆప్టికల్ ఆడియో ఇన్ పుట్, బ్రావియా సింక్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.