Galaxy Buds 3 మరియు Buds 3 Pro లాంచ్ చేసిన శామ్సంగ్: ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి కొత్త బడ్స్ Galaxy Buds 3 మరియు Buds 3 Pro లను విడుదల చేసింది.

ఈ రెండు బడ్స్ కూడా ఈరోజు నుంచి Pre Orders కి అందుబాటులోకి తీసుకు వచ్చింది

లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ వంటి ఫీచర్స్ తో మార్కెట్లో ప్రవేశపెట్టింది

Samsung ఈరోజు నిర్వహించిన అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి కొత్త బడ్స్ Galaxy Buds 3 మరియు Buds 3 Pro లను విడుదల చేసింది. ఈ బడ్స్ 3 సిరీస్ నుండి విడుదల చేసిన ఈ రెండు బడ్స్ కూడా ఈరోజు నుంచి Pre Orders కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ బడ్స్ ను ప్రీమియం బిల్డ్, ANC సపోర్ట్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ వంటి ఫీచర్స్ తో మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Galaxy Buds 3 మరియు Buds 3 Pro: ధర

శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను రూ. 14,999 ధరలో విడుదల చేయగా, బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ ను రూ. 19,999 ధరలో విడుదల చేసింది. ఈ బడ్స్ సేల్ జూలై 24 వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ బడ్స్ samsung.com మరియు Amazon నుండి లభిస్తాయి.

Also Read: Samsung Galaxy Z Flip 6: కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!

Galaxy Buds 3 మరియు Buds 3 Pro: ఫీచర్లు

గెలాక్సీ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను 11mm (1 way) డైనమిక్ స్పీకర్స్ తో అందించింది. ఈ బడ్స్ అల్ట్రా హై క్వాలిటీ సౌండ్ ,మరియు 360 ఆడియో అందిస్తుందని శామ్సంగ్ తెలిపింది. ఈ బడ్స్ లో యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ వుంది మరియు బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో సూపర్ కనెక్టివిటీ అందిస్తుంది. ఈ బడ్స్ లో వాయిస్ పికప్ యూనిట్ (VPU), స్వైప్ మరియు హల్ సెన్సార్ లను కలిగి వుంది. ఈ బడ్స్ సింగల్ ఛార్జ్ తో 6 గంటల ప్లే టైమ్ ను (ANC Off) బాక్స్ తో టోటల్ 30 గంటల ప్లే టైమ్ ను అందిస్తుంది. ఈ బడ్స్ IP57 రేటింగ్ తో వస్తుంది.

Galaxy Buds 3 and buds 3

ఇక బడ్స్ 3 ప్రో ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ డ్రైవర్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో, 10.5mm డైనమిక్ స్పీకర్ + 6.1mm ప్లానర్ ట్వీటర్ కలిగిన డ్యూయల్ స్పీకర్ తో వస్తుంది. బడ్స్ 3 ప్రో 24bit Hi-Fi, అల్ట్రా హై క్వాలిటీ (UHD) సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ లో ANC సపోర్ట్ మరియు యాంబియంట్ సౌండ్ వాయిస్ డిటెక్ట్ ఫీచర్ వుంది. ఇది కూడా టోటల్ 30 గంటల ప్లే టైమ్ ను అందిస్తుంది. అయితే, కేవలం బడ్స్ తో 7 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది డైరెక్ట్ మల్టీ ఛానల్ తో 360 ఆడియో మరియు అల్ట్రా హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. బడ్స్ 3 ప్రో కూడా బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో సూపర్ కనెక్టివిటీ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :