Samsung 5.1 Dolby soundbar got big deals from flipkart
Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ డాల్బీ మరియు DTS రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు పూర్తి వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఎటువంటి వైర్లు లేని సెటప్ కలిగి ఉండటమే కాకుండా ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
శాంసంగ్ యొక్క HW-B67EF/XL పై ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 44% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 21,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. Canara బ్యాంక్, BOB CARD మరియు IDFC, SBI మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 20,490 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు డైనమిక్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ వైర్లెస్ రియర్ స్పీకర్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ ఉంటుంది మరియు ఎటువంటి వైర్లు అవసరం లేకుండా గొప్ప సెటప్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీకు గొప్ప సరౌండ్ మరియు జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్డాల్బీ డిజిటల్, DTS Virtual-X మరియు Q-Symphony సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ గొప్ప క్లారిటీ కలిగిన మరియు సినిమా థియేటర్ వంటి ఫీల్ అందించే సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ అడాప్టివ్ సౌండ్, వాయిస్ ఎన్ హెన్స్ మరియు ప్రత్యేకమైన గేమింగ్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: OnePlus 15: కంప్లీట్ ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI ఇన్, HDMI అవుట్, HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సొంతం చేసుకోవచ్చు.