Samsung 120W Dolby Atmos today available at half price on flipkart
Samsung 120W Dolby Atmos స్పీకర్ జబర్దస్త్ డిస్కౌంట్ తో ఈరోజు కేవలం సగం ధరకే లభిస్తోంది. ఇది 2024 చివరిలో శామ్సంగ్ అందించిన 120W డాల్బీ అట్మాస్ పవర్ ఫుల్ స్పీకర్. ఇది చూడటానికి ఫోటోలు పెట్టుకునే వాల్ ఫ్రేమ్ మాదిరిగా ఉంటుంది. అయితే, ఇది జబర్దస్త్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ తో మీ మనసు దోచుకుంటుంది. ఈ వినూత్నమైన స్పీకర్ మీ ఇంటి డెకరేషన్ లో భాగంగా ఉంటూనే బ్లూటూత్ స్పీకర్ గా కూడా పని చేస్తుంది.
samsung HW-LS60D/XL వాల్ ఫ్రేమ్ 2.0 డాల్బీ అట్మాస్ స్మార్ట్ స్పీకర్ ఈరోజు సగం ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ స్పీకర్ ఇండియాలో రూ. 23,999 రూపాయల ధరతో లాంచ్ అవ్వగా, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయల అతి చవక ధరతో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ స్పీకర్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ఫ్లిప్ కార్ట్ బజాజ్ ఇన్స్టా స్మార్ట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1,400 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
Also Read: BSNL Best Plan: ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు.. సంవత్సరం మొత్తం ఆనందమే.!
శాంసంగ్ ఈ స్మార్ట్ స్పీకర్ ని చాలా ప్రత్యేకమైన వాల్ ఫ్రేమ్ డిజైన్ తో లాంచ్ చేసింది. మీ ఇంట్లో ఇది మీ ఫోటోలు పెట్టుకునే మంచి వాల్ ఫ్రేమ్ గా మీ ఇంట్లో మారిపోతుంది. అయితే, ఈ స్పీకర్ కలిగిన స్పీకర్ సెటప్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ శామ్సంగ్ స్పీకర్ మొత్తం 6 స్పీకర్లు మూడు వైపులా కలిగి ఉంటుంది. అలాగే, స్పేస్ ఫిట్ సౌండ్ ప్రో ఫీచర్ తో వస్తుంది. ఇది మీరు ఈ ఫ్రేమ్ ను సెట్ చేసిన రూమ్ పరిమాణం అనలైజ్ చేసి సౌండ్ సరిచేస్తుంది.
ఈ శామ్ సంగ్ స్పీకర్ వైర్లెస్ డాల్బీ అట్మాస్ మరియు అట్మాస్ మ్యూజిక్ తో పాటు డాల్బీ డిజిటల్ ప్లస్ అడాప్టివ్ సౌండ్ తో వస్తుంది. అంటే, ఇది కంప్లీట్ డాల్బీ ప్యాకేజ్ తో మీకు అందుతుంది. యాక్టివ్ వాయిస్ ఆమ్ప్లిఫైర్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది Wi-Fi కనెక్టివిటీ, ఆప్టికల్ కనెక్టివిటీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ తో మంచి సెటప్ కలిగి ఉంటుంది.