realme launches Techlife Studio H1 headphone with hi res audio
Realme ఇండియాలో కొత్త హెడ్ ఫోన్ ను లాంచ్ చేసింది. Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ తో పాటు Techlife Studio H1 హెడ్ ఫోన్ ను కూడా విడుదల చేసింది. ఈ హెడ్ ఫోన్ ను Hi-Res Audio మరియు Spatial Audio తో ఈ హెడ్ ఫోన్ ను విడుదల చేసింది. మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసిన ఈ హెడ్ ఫోన్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది.
రియల్ మీ స్టూడియో H1 హెడ్ ఫోన్ ను రూ. 4,999 ధరతో విడుదల చేసింది. ఈ హెడ్ ఫోన్ అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ హెడ్ ఫోన్ రెడ్, బ్లాక్ మరియు వైట్ మూడు కలర్ లలో లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ పైన లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 500 రూపాయల తగ్గింపు ఆఫర్ ను కూడా అందించింది.
రియల్ మీ యొక్క ఈ లేటెస్ట్ హెడ్ ఫోన్ పెద్ద 40mm PET డైఫాగ్రామ్ స్పీకర్ తో లను కలిగి ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ LDAC, Hi-Res డబుల్ గోల్డ్ లెబల్ సౌండ్ క్వాలిటీ మరియు Spatial ఆడియో ఎఫెక్ట్ తో వస్తుంది. రియల్ మీ హెడ్ ఫోన్ 43 dB అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది.
స్టూడియో H1 హెడ్ ఫోన్ 70 గంటల ప్లే టైమ్ అందించే గొప్ప బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 10 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్ Bluetooth 5.4 సపోర్ట్ మరియు డ్యూయల్ డివైజ్ కనెక్షన్ సపోర్ట్ కూడా కలిగి వుంది. ఇది మాత్రమే కాకుండా మంచి కాలింగ్ కోసం Call నోయిస్ క్యాన్సిలేషన్ ను కలిగి వుంది.
Also Read: గ్రౌండ్ షేక్ చేసే LG 600W Soundbar పై అమెజాన్ పండగ సేల్ ధమాకా ఆఫర్.!
ఈ హెడ్ ఫోన్ స్కిన్ ఫ్రెండ్లీ గా వుండే వేగాన్ లెథర్ మరియు స్పాంజ్ మెమరీ కుషన్ తో ఉంటుంది. ఈ రియల్ మీ కొత్త హెడ్ ఫోన్ ఫంక్షన్ బటన్స్, సర్దుబాటు చేయగల హెడ్ బీమ్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్ తో వస్తుంది.