Realme Buds N1 46dB hybrid noise cancellation launched
Realme Buds N1: ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త బడ్స్ ను లాంచ్ చేసింది. ఈరోజు రియల్ మీ లాంచ్ చేసిన Realme Narzo 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ తో పాటుగా ఈ రియల్ మీ బడ్స్ ఎన్ 1 ను కూడా విడుదల చేసింది. ఈ బడ్స్ ను 46dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ బడ్స్ పై మంచి లాంచ్ ఆఫర్ లను కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది.
రియల్ మీ బడ్స్ ఎన్ 1 ను రూ. 2,499 ధరలో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను తక్కువ ధరకు అందుకునేలా మంచి ఆఫర్లు కూడా రియల్ మీ అందించింది.ఈ బడ్స్ ను ఫస్ట్ సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ 300 ఫ్లాట్ డిస్కౌంట్ మరియు రూ. 200 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఈ రెండు ఆఫర్లతో ఈ బడ్స్ ను కేవలం రూ. 1,999 రూపాయల ధరకే అందుకునే అవకాశం వుంది. ఈ బడ్స్ మొదటి సేల్ సెప్టెంబర్ 13వ మధ్యాహ్నం 12 గంటల నుంచి మిడ్ నైట్ వరకు జరుగుతుంది. ఈ బడ్స్ ను అమెజాన్ మరియు realme.com నుంచి సేల్ చేస్తుంది.
Also Read: Realme Narzo 70 Turbo: చాలా చవక ధరలో గొప్ప ఫీచర్స్ తో వచ్చింది.!
రియల్ మీ ఈ కొత్త బడ్స్ ను 12.4mm డైనమిక్ బాస్ స్పీకర్స్ తో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను డ్యూయల్ డివైజ్ కనెక్షన్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ ను లెట్స్ బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ కలిగి వున్న స్పీకర్లతో డైనమిక్ సౌండ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ లో 360 డిగ్రీల స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ సపోర్ట్ కూడా వుంది.
ఈ బడ్స్ ను 46dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో అందించింది. ఈ బడ్స్ 45ms అల్ట్రా లో లెటెన్సీ మోడ్ తో మంచి గేమింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ బడ్స్ టోటల్ 40 గంటల ప్లే టైం అందిస్తాయి మరియు IP55 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.