సరౌండ్ సౌండ్ టెక్ తో వచ్చిన Realme కొత్త ఇయర్ బడ్స్.!

HIGHLIGHTS

Realme Buds Air 5 Pro బడ్స్ ను మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో విడుదల చేసింది

ఈ బడ్స్ 360 డిగ్రీల స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ సపోర్ట్ తో వస్తుంది

Realme Buds Air 5 Pro బడ్స్ ను Coaxial స్పీకర్ సెటప్ తో అందించింది

సరౌండ్ సౌండ్ టెక్ తో వచ్చిన Realme కొత్త ఇయర్ బడ్స్.!

రియల్ మి ఇండియాలో Realme Buds Air 5 Pro బడ్స్ ను మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ Realme Buds Air 5 Pro ఇయర్ బడ్స్ కంఫర్ట్ ఫిట్ డీసెంట్ డిజైన్ తో పాటుగా పవర్ఫుల్ స్పీకర్స్ తో లాంచ్ అయ్యయి. ఈ రియల్ మి Hi-Res Audio ఇయర్ బడ్స్ లో అందించిన టాప్ ఫీచర్లు, స్పెక్స్ మరియు ధర తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Buds Air 5 Pro: 

రియల్ మి ఈ Realme Buds Air 5 Pro బడ్స్ ను Coaxial స్పీకర్ సెటప్ తో అందించింది. ఇందులో 11mm BASS స్పీకర్స్ మరియు 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్ ఉన్నాయి. అంటే, హెవీ మరియు డీప్ బాస్ తో పాటు క్లియర్ Treble ను కూడా అందిస్తుంది. ఈ బడ్స్ ఎయిర్ 5 ప్రో ఇయర్ బడ్స్ తో Studio Quality సౌండ్ ను అందించవచ్చని రియల్ మి తెలిపింది. 

ఈ బడ్స్ సర్టిఫైడ్ Hi-Res LDAC ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. ఈ బడ్స్ 360 డిగ్రీల స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ సపోర్ట్ తో వస్తుంది మరియు సరౌండ్ సౌండ్ అందిస్తుందని కూడా రియల్ మి గొప్పగా చెబుతోంది.

Realme Buds Air 5 Pro 

రియల్ మి బడ్స్ ఎయిర్ 5 ప్రో 50dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ని కలిగి వుంది. ఈ ఫీచర్ ద్వారా మీ చుట్టూ ఉండే ఎటువంటి సౌండ్ అయినా సరే ఈ బడ్స్ ను దాటుకొని మీ చెవులకు చేరదు. అంటే, ఎటువంటి రణగొణ లేని చక్కని సౌండ్ మీకు అందుతుంది. క్లియర్ కాల్స్ కోసం ఈ ఫోన్ లో నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన 6-mic సిస్టం కూడా వుంది. 

40ms లో లెటెన్సీ మోడ్ తో ఈ బడ్స్ అంతరాయం లేని గొప్ప గేమింగ్ అనుభూతిని ఈ బడ్స్ అందిస్తాయి. ఈ బడ్స్ Bluetooth 5.3 తో సీమ్ లెస్ కనెక్టివిటీ, బిగ్ బ్యాటరీతో 40 గంటల వరకూ ప్లే బ్యాక్, డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు స్మార్ట్ టచ్ కంట్రోల్స్ తో వస్తాయి.

రియల్ మి ఈ బడ్స్ ను రూ. 4,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ బడ్స్ పైన రూ.500 డిస్కౌంట్ అఫర్ ను అందించింది. ఆగష్టు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ రియల్ మి ఇయర్ బడ్స్ మొదటి సేల్ మొదలువుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo