రూ.1,000 లోపల సౌండ్ బార్ కావాలా.. ఈ కొత్త సౌండ్ బార్ గురించి తెలుసుకోండి.!

HIGHLIGHTS

రూ.1,000 లోపల సౌండ్ బార్

pTron ఆవిష్కరించిన కొత్త సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది

రూ.1,000 లోపల సౌండ్ బార్ కావాలా? అయితే, ఇండియాలో pTron ఆవిష్కరించిన ఈ కొత్త సౌండ్ బార్ గురించి తెలుసుకోండి. pTron ఇండియాలో తన లేటెస్ట్ సౌండ్‌ బార్ 'Musicbot Evo' ని లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ను కేవలం 1,000 రూపాయల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో విడుదల చెయ్యడం విశేషం. దేశవ్యాప్తంగా OTT లకు పెరుగుతున్న ప్రజాదరణకు అనుగుణంగా పెరుగుతున్న హోమ్ థియేటర్‌ సౌండ్ సిస్టమ్ డిమాండ్‌ ను రీచ్ అయ్యేలా ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను ప్రవేశపెట్టినట్లు pTron పేర్కొంది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా.      

pTron Musicbot Evo సౌండ్ బార్ సొగసైన డిజైన్‌తో మరియు లేటెస్ట్ టెక్నాలజీతో మేళవింపుగా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది మరియు 10 గంటల ప్లేబ్యాక్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDTVలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మొదలైన వాటికి సరిగ్గా సరిపోతుంది. Musicbot Evo సౌండ్ బార్ కేవలం 38.7cm పొడవు, 6.5 cm లోతు మరియు 6.5 cm ఎత్తుతో ఉంటుంది. ఇది మెటాలిక్ ఫ్రంట్ గ్రిల్స్ మరియు మృదువైన గుండ్రని అంచులతో స్థూపాకార డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 10W స్పీకర్లు మరియు 52mm డ్రైవర్స్ తో ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ లో వున్నా బ్లూటూత్ 5.0 ద్వారా వైర్‌ తో పనిలేకుండా చాలా సులభంగా మీరు మీ TV, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌కి కనెక్ట్ చెయ్యవచ్చు. అంతేకాదు, మరింత సౌండ్ సౌండ్ ను పొందాలనుకుంటే, వైర్‌లెస్ స్టీరియో పెయిరింగ్ ఫంక్షన్ ద్వారా రెండు Musicbot Evo లను కూడా కనెక్ట్ చేయవచ్చు. అలాగే, మీరు 3.5mm AUX ఇన్‌పుట్, USB డ్రైవ్, TF కార్డ్ లేదా బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్ లను అందుకుంటారు.

pTron Musicbot Evo సౌండ్ బార్ కేవలం రూ.999 ధరతో వచ్చింది మరియు 23 ఆగస్ట్ 2022 నుండి Flipkart నుండి లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :