బడ్జెట్ ధరలో Dolby Atmos ట్రూ వైర్లెస్ బడ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో Dolby Atmos ట్రూ వైర్లెస్ బడ్స్ తెచ్చిన ఒప్పో

OPPO Enco Buds2 సేల్ కి అందుబాటులోకి వస్తోంది

ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ పెద్ద 10mm టైటానైజ్డ్ స్పీకర్లతో వస్తుంది

బడ్జెట్ ధరలో Dolby Atmos ట్రూ వైర్లెస్ బడ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, ఒప్పో ఇటీవల విడుదల చేసిన ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ OPPO Enco Buds2 సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ను కేవలం రూ.1,799 రూపాయల ధరలో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో తీసుకొచ్చింది. అంతేగాదు, ఈ కొత్త వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ గొప్ప బాస్ పెర్ఫామెన్స్ కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ ట్రూ వైర్లెస్ బడ్స్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.

OPPO Enco Buds2  లను 31 ఆగస్టు 2022 నుండి మీరు OPPO స్టోర్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో నుండి పొందవచ్చు. ఈ బడ్స్ ను ఒప్పో రూ.1,799 రూపాయల ధరతో అందించింది. ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ పెద్ద 10mm టైటానైజ్డ్ స్పీకర్లతో వస్తుంది మరియు మెరుగైన BASS ను మీకు అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో అందించిన స్పీకర్ల పైన పోసిన డయాఫ్రాగమ్ పూత ద్వారా మరింత బ్యాలెన్స్ సౌండ్ ను అందిస్తుందని కూడా కంపెనీ పేర్కొంది.

ఈ TWS  ఒరిజినల్ సౌండ్, Bass Boost బూస్ట్ మరియు క్లియర్ వోకల్స్ వంటి మూడు రకాల సెట్టింగ్‌ లను కలిగి ఉన్న Dolby Atmos తో పాటు OPPO యొక్క యాజమాన్య ఎన్కో లైవ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌లకు మద్దతు ఇస్తుంది. ఇవి తేలికైనవి మరియు IPX4 రేటింగ్ తో చెమట మరియు తుంపర్ల నుండి రక్షణ అందిస్తుంది. ఈ బడ్స్ పూర్తి చార్జింగ్ తో 7 వరకూ ప్లేబ్యాక్ అందిస్తుంది. ఇక ఛార్జింగ్ కేస్ ను కూడా కలుపుకుంటే 28 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది.

ఇక కనెక్టివిటీ పరంగా, ఈ TWS తక్కువ-లేటెన్సీ బ్లూటూత్ 5.2 ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది స్థిరమైన కనెక్టివిటీని అందిస్తుంది. అంటే, గేమింగ్ సమయాల్లో కూడా సంప్రదాయమైన హెడ్ ఫోన్ మాదిరిగా ఎటువంటి జాప్యం లేని గేమింగ్ అనుభూతిని పొందవచ్చని దీని అర్ధం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :