రూ.2,299 ధరకే Heavy Bass తో వచ్చిన CE బడ్స్ సేల్ మొదలు.!

Oneplus కేవలం 2 వేల రూపాయల ధరలో హెవీ Bass సౌండ్ మరియు కొత్త ఫీచర్లు కలిగిన TWS బడ్స్ లాంచ్ చేసింది. వన్ ప్లస్ నార్డ్ బడ్స్ CE పేరుతొ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త ట్రూ వైర్లెస్ బడ్స్  పెద్ద 13.4mm డైనమిక్ డ్రైవర్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చిన ఈ వన్ ప్లస్ బడ్స్ ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటుగా ఆకట్టుకునే ధరతో వచ్చింది.  

OnePlus Nord Buds CE: ధర మరియు ఫీచర్లు

వన్ ప్లస్ ఈ వన్ ప్లస్ నార్డ్ బడ్స్ CE ని కేవలం రూ.2,299 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్స్ ఆగష్టు 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అధికారిక వెబ్ సైట్ ద్వారా సేల్ కి అంధుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ మూన్ లైట్ వైట్ మరియు మిస్టీ గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తుంది.   

ఇక ఈ బడ్స్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బడ్స్ ని పెద్ద 13.4mm డైనమిక్ డ్రైవర్స్ తో అందించింది. తద్వారా, డీప్ మరియు హెవీ Bass ను ఆస్వాదించవచ్చని వన్ ప్లస్ తెలిపింది. దీనికి తోడు ఇందులో అందించిన సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ సౌండ్ ను మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈ ఈక్వలైజర్ లో Bass, Serenade, Gentle మరియు Balanced అనే నాలుగు మోడ్స్ ఉంటాయి.

మంచి కాలింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో AI నోయిస్ క్యాన్సిలేషన్ ని జతచేసింది. అంతేకాదు, అద్భుతమైన గేమింగ్ అనుభవం కోసం 94ms అల్ట్రా-లో లేటెన్సీ తో వస్తుంది. OnePlus Nord Buds CE మొత్తంగా 20 గంటల ప్లే టైం అందిస్తుందని వన్ ప్లస్ చెబుతోంది. ఈ బడ్స్ కేవలం 3.5 గ్రామూల బరువుతో చాలా తేలికగా ఉంటాయి.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :