Noise Master Buds with sound bose and stunning design
Noise Master Buds: నోయిస్ అప్ కమింగ్ బడ్స్ గురించి భారీగా టీజింగ్ చేస్తోంది. అయితే, ఇందుకు తగిన కారణం కూడా ఉందనుకోండి. నోయిస్ తాన్ అప్ కమింగ్ బడ్స్ మాస్టర్ బడ్స్ ను Sound By BOSE సపోర్ట్ తీసుకొస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ బడ్స్ ను ఆకట్టుకునే స్టన్నింగ్ డిజైన్ తో కూడా అందిస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈరోజు ఈ బడ్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
నోయిస్ అప్ కమింగ్ బడ్స్ మాస్టర్ బడ్స్ ను ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ బడ్స్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
నోయిస్ మాస్టర్ బడ్స్ ను Sound By BOSE తో లాంచ్ చేస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ బడ్స్ తో హై క్వాలిటీ మరియు అద్భుతంగా ట్యూన్ చేయబడిన సౌండ్ ను ఎంజాయ్ చేయండి, అనిన్ నోయిస్ టీజింగ్ ద్వారా చెబుతోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను LHDC 5.0 ఫీచర్ తో అందిస్తున్నట్లు నోయిస్ కన్ఫర్మ్ చేసింది. ఇది 24 bit / 96 kHz సూపర్ క్లారిటీ సౌండ్ సపోర్ట్ తో వస్తుందిట.
ఈ అప్ కమింగ్ బడ్స్ యొక్క మరో కీలకమైన ఫీచర్ గురించి కూడా టీజింగ్ చేస్తోంది. అదేమిటంటే, 49dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్స్. అంటే, ఈ బడ్స్ బయట నుంచి వచ్చే నోయిస్ ను పూర్తిగా నిలిపి వేసి అంకఞ్హి లీనమయ్యే క్లారిటీ సౌండ్ ను అందిస్తాయి అని అర్థం.
Also Read: iQOO Neo 10R : రెండు డిఫరెంట్ కలర్స్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది.!
ఇక ఈ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే, ఈ బడ్స్ బాక్స్ ను సరికొత్త హాఫ్ రౌండ్ డిజైన్ మరియు పెద్ద రౌండ్ నాబ్ లాంటి డిజైన్ లో నోటిఫికేషన్ లైట్ టాప్ అందిస్తోంది. ఇది చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఇందులో ఉన్న ఇయర్ బడ్స్ కూడా చాలా సాలిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో కనిపిస్తున్నాయి. నోయిస్ ఈ బడ్స్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను త్వరలోనే విడుదల చేస్తుందట.