Noise Master Buds launched with Bose sound launched under budget price
Noise Master Buds: గత కొంత కాలంగా నోయిస్ టీజింగ్ చేస్తున్న నోయిస్ మాస్టర్ బడ్స్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు BOSE సౌండ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ముందెన్నడూ లేని విధంగా ఈ బడ్స్ ను సరికొత్త మరియు చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ బడ్స్ ధరను ను బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకొని అందించినట్లు అర్ధం అవుతుంది.
నోయిస్ మాస్టర్ బడ్స్ ను రూ. 7,999 MRP ధరతో లాంచ్ చేసింది. అయితే, Pre-Book చేసుకునే వారికి ఈ బడ్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ బడ్స్ ను కేవలం రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
నోయిస్ మాస్టర్ బడ్స్ ను రూ.999 రూపాయలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకునే యూజర్లకు రూ. 2,000 రూపాయల ప్రీ ఆర్డర్ పాస్ (కూపన్) అందిస్తుంది. సేల్ మొదలైనప్పుడు ఈ పాస్ లేదా కూపన్ ను ఉపయోగించి రూ. 5,999 తో బడ్స్ ను అందుకోవచ్చు. ఈ పాస్ లాంచ్ డేట్ నుంచి 14 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, 6 నెలల No Cost EMI ఆఫర్ ని కూడా ఈ బడ్స్ పై అందిస్తోంది.
నోయిస్ మాస్టర్ బడ్స్ ను ఒరిజినల్ ఆడియో ఫార్మాట్ వినైల్ రికార్డ్ ఇన్స్పిరేషన్ తో అందించింది. ఈ బడ్స్ కేవలం 4.2 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటాయి మరియు చాలా కంఫర్ట్ ఫిట్ తో వస్తాయి, అని నోయిస్ తెలిపింది. నోయిస్ ఈ బడ్స్ ను Sound By BOSE సౌండ్ సపోర్ట్ అందించింది. ఈ బడ్స్ ను పేరుకు తగ్గట్టుగానే మాస్టర్ డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించింది.
ఈ నోయిస్ కొత్త బడ్స్ LHDC 5.0 తో రియల్ డీటెయిల్స్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 24bit / 96 kHz High-Res Audio సపోర్ట్ తో వస్తుంది. ఇక ఇందులో అందించిన స్పీకర్ల విషానికి వస్తే, ఇందులో 12.4mm PEEK + టైటానియం డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఈ నోయిస్ బడ్స్ అడాప్టివ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Vivo V50 Price Leaked: లాంచ్ కంటే ముందే లీకైన వివో వి50 ప్రైస్ వివరాలు.!
ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ పైరింగ్ మరియు ఇన్ ఇయర్ డిటెక్షన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 6 మైక్ ENC సపోర్ట్ తో వస్తుంది మరియు క్రిస్టల్ క్లారిటీ కాలింగ్ అందిస్తుందని నోయిస్ చెబుతోంది. ఈ బడ్స్ Noise Audio App సపోర్ట్ తో వస్తుందిట మరియు బడ్స్ పై మరింత కంట్రోల్ అందిస్తుంది. ఈ బడ్స్ టోటల్ 44 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది ఇన్స్టాంట్ ఛార్జ్ మరియు లో లెటెన్సీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.