కేవలం రూ.1,299 ధరలో 50hr ప్లేబ్యాక్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన నోయిస్.!

HIGHLIGHTS

Noise ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది

Noise Buds VS106 రూ. 1,299 రూపాయల ధరలో లాంచ్

50 గంటల టోటల్ ప్లేబ్యాక్ టైమ్ తో లాంచ్ చెయ్యడం విశేషం

ప్రముఖ ఇండియన్ స్మార్ట్ ప్రోడక్ట్స్ బ్రాండ్ Noise ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. Noise Buds VS106 పేరుతో లాంచ్ చేసిన ఈ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,299 రూపాయల ధరలో 50 గంటల టోటల్ ప్లేబ్యాక్ టైమ్ తో లాంచ్ చెయ్యడం విశేషం. ఈ Buds VS106 కేవలం బ్యాటరీ బ్యాకప్ లో మాత్రమే కాకుండా మరిన్ని విభాగాల్లో కూడా మంచి ఫీచర్లనే కలిగి వుంది. ఈ లేటెస్ట్ నోయిస్ ఇయర్ బడ్స్ విశేషాలు ఏమిటో చూద్దాం పదండి. 

Noise Buds VS106: ధర & సేల్

పైన తెలిపిన విధంగా ఈ Noise Buds VS106 ను కేవలం రూ. 1,299 రూపాయల అఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ప్రస్తుతం www.gonoise.com నుండి మాత్రమే లభిస్తున్నాయి. ఈ సైట్ నుండి ఈ బడ్స్ అఫర్ ధరతో లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది మరియు ఈరోజు ఈ అఫర్ ముగుస్తుందని కూడా సూచించింది. అయితే, ఈ బడ్స్ MRP ధరను మాత్రం Rs. 4,499 ధరతో చూపిస్తోంది. లాంచ్ అఫర్ ముగిసిన తరువాత ఎంత రేటును ఫిక్స్ చేస్తుందో చూడాలి.

Noise Buds VS106: ప్రత్యేకతలు

ఇక ఈ Noise Buds VS106 ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ 10mm స్పీకర్స్ తో వస్తాయి. మంచి క్వాలిటీ సౌండ్ అందించాడని మరియు నచ్చిన సౌండ్ సెట్ చేసుకోవడానికి వీలుగా నోయిస్ ఈ బడ్స్ లో 3 బిల్ట్ ఇన్ EQ మోడ్ లను జత చేసింది. అవి, Normal, Bass Mode మరియు Gaming Mode ఉన్నాయి. ఈ మోడ్స్ ద్వారా మీకు అనుకూలతను బట్టి సౌండ్ ను ఎంజాయ్ చేయవచ్చు అని కంపెనీ తెలిపింది. 

ఈ బడ్స్ 40ms వరకూ Low Latency తో మీ గేమింగ్ సమయంలో ఎటువంటి అంతరాయం ఉండదని నోయిస్ చెబుతోంది. ఈ బడ్స్ టోటల్ 50 గంటల వరకూ ప్లేబ్యాక్ ను అందిస్తుందని కూడా నోయిస్ గొప్పగా చెబుతోంది. ఇది కాకుండా ఇన్స్టా ఛార్జ్ టెక్ తో ఫాస్ట్ ఛార్జింగ్, ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్ (ENC) తో కూడిన క్వాడ్ Mic సెటప్ మరియు చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో నోయిస్ ఈ Noise Buds VS106 ను లాంచ్ చేసింది. 

ఈ నోయిస్ బడ్స్ చవక ధరలో లేటెస్ట్ ఫీచర్లను మరియు అధిక ప్లేబ్యాక్ టైం కోరుకునే వారికి సరిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :