Noise Air Clips 2 launched with AirWave technology
Noise Air Clips 2: నోయిస్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నోయిస్ సక్సెస్ ఫుల్ బడ్స్ సిరీస్ ఎయిర్ క్లిప్స్ యొక్క నెక్స్ట్ జనరేషన్ బడ్స్ గా ఈ బడ్స్ లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను సరికొత్త ఎయిర్ వేవ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. డిడ్ మాత్రమే కాదు ఈ బడ్స్ మూడు సరికొత్త రంగుల్లో కూడా లాంచ్ అయ్యింది. ఈ కొత్త బడ్స్ కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ గురించి తెలుసుకోండి.
నోయిస్ ఈ కొత్త బడ్స్ ను రూ. 3,499 రూపాయల లాంచ్ ప్రైస్ తో మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు నోయిస్ అఫీషియల్ సైట్ నుంచి ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్స్ ఫ్రాస్ట్ బ్లాక్, ఫ్రాస్ట్ గ్రీన్ మరియు ఫ్రాస్ట్ ఐవరీ ముందుది అందమైన రంగులో లభిస్తుంది.
నోయిస్ ఎయిర్ క్లిప్స్ 2 కొత్త ఇయర్ బడ్స్ కొత్త ఎయిర్ వేవ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఓపెన్ ఇయర్ డిజైన్ కలిగి ఉన్నా ఈ బడ్స్ నుంచి వచ్చే సౌండ్ బయటకు రాకుండా కేవలం ఆ బడ్స్ ధరించిన వారికి మాత్రమే వినిపించే విధంగా ఉంటుంది. ఈ బడ్స్ కంఫర్టబుల్ డిజైన్ మరియు చెవులు పూర్తిగా మూసేలా గొప్ప డిజైన్ తో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 12mm స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ హైపర్ సింక్ మరియు IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ నోయిస్ బడ్స్ రోజంతా ధరించినా కూడా నొప్పి తెలియని విధంగా ఉండే మెత్తని క్లిప్ ఆన్ గ్రిప్ డిజైన్ తో ఉంటుంది. ఈ బడ్స్ 40 గంటల ప్లే అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: Vivo T4R 5G స్మార్ట్ ఫోన్ HDR 10 ప్లస్ AMOLED స్క్రీన్ మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతుంది.!
ఈ కొత్త నోయిస్ ఇయర్ బడ్స్ క్వాడ్ మైక్ ENC సపోర్ట్ మరియు లో లెటెన్సీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.