Moto Buds Loop sound by bose price and features
Moto Buds Loop పేరుతో ఈరోజు మోటోరోలా కొత్త రకం బడ్స్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్స్ మీరు ఉపయోగించే రెగ్యులర్ ఇయర్ బడ్స్ మాదిరిగా కాకుండా వెరైటీ డిజైన్ తో ఉంటుంది. అంతేకాదు, ఆడియో ప్రొడక్ట్స్ ప్రపంచంలో పేరుగాంచిన BOSE సౌండ్ తో ఈ బడ్స్ ను అందించింది. మోటోరోలా అందించిన ఈ కొత్త రకం ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు వివరాలు తెలుసుకోండి.
మోటో బడ్స్ లూప్ ఇయర్ బడ్స్ ను రూ. 7,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను HDFC యొక్క 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ బడ్స్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
మోటో బడ్స్ లూప్ ఇయర్ బడ్స్ ను సరికొత్త క్లిప్ డిజైన్ తో అందించింది. ఇది రెగ్యులర్ ఇయర్ బడ్స్ మాదిరిగా కాకుండా సరికొత్త రూపంలో ఉంటుంది. ఈ బడ్స్ నుంచి చెవులకు తగిలించే డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ ను ఎక్కువ సమయం ధరించినా కూడా చెవులకు నొప్పి కలుగని విధంగా డిజైన్ చేసినట్లు మోటోరోలా చెబుతోంది. అంతేకాదు, ఈ బడ్స్ చెవులు లోపలికి వెళ్లకుండా చెవుల బయట ద్వారం (కెనాల్) వద్ద సౌండ్ రిలీజ్ చేసింది.
ఇక స్పీకర్ సెటప్ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ ను12 mm ఐరన్ లెస్ స్పీకర్లతో అందించింది. ఇది గొప్ప సౌండ్ అందించే విధంగా BOSE సౌండ్ టెక్నాలజీ తో ట్యూన్ చేయబడింది. ఇది కాకుండా ఈ బడ్స్ స్పేషియల్ సౌండ్ సపోర్ట్ తో లీనమయ్యే సౌండ్ అందిస్తుందని మోటోరోలా ఈ బడ్స్ గురించి గొప్పగా చెబుతోంది.
Also Read: Flipkart కొత్త సేల్ నుంచి OPPO K13x 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
ఈ మోటోరోలా కొత్త బడ్స్ టోటల్ 31 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 3 గంటల ప్లే టైమ్ అందించే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఇయర్ బడ్స్ మోటోరోలా బడ్స్ యాప్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది Crystal Talk AI డ్యూయల్ మైక్రో ఇయర్ ఫోన్ సెటప్ తో క్రిస్టల్ క్లియర్ కాలింగ్ సౌలభ్యం కూడా ఆఫర్ చేస్తుందట. మోటో బడ్స్ లూప్ ఇయర్ బడ్స్ IP54 వాటర్ రిపెల్లెంట్ ఫీచర్ మరియు రీ ఎన్ ఫోర్స్ మెమరీ అలాయ్ కలిగి ఉంటుంది.