MIVI launching superpods with Opera ANC and Japanese audio society approve
భారతీయ ఎలక్ట్రానిక్స్ యాక్ససరీస్ బ్రాండ్ MIVI జపనీస్ ఆడియో సొసైటీ అప్రూవ్ Opera ANC తో కొత్త సూపర్ పోడ్స్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ కంపెనీ ఈ విభాగంలో మంచి ఫీచర్స్ తో కొత్త బడ్స్ ను తీసుకువస్తున్నట్లు ఈ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు తెలిపింది. ఈ బడ్స్ మంచి సౌండ్ అందించే అన్ని వివరాలు కలిగి ఉన్నట్లు కూడా టీజింగ్ ద్వారా తెలియ చేసింది.
మివి ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను సెప్టెంబర్ 6 వ తేదీ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ అప్ కమింగ్ మివి బడ్స్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించి దాని ద్వారా టీజింగ్ చేస్తుంది.
మివి తీసుకురాబోతున్న ఈ బడ్స్ ను ఓపెరా ANC కలిగిన సూపర్ బడ్స్ గా పిలుస్తోంది. ఈ బడ్స్ ను జపనీస్ ఆడియో సొసైటీ అప్రూవ్ తో తీసుకొస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ బడ్స్ LDAC ఆడియో కోడాక్ మరియు Hi-Res Wireless సర్టిఫికేషన్ తో అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ బడ్స్ ఈ సూపర్ టెక్ తో సూపర్ ఆడియో అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ బడ్స్ 35dB ANC ఫీచర్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు 3D సౌండ్ స్టేజ్, Spatial Audio సపోర్ట్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ మల్టీ డివైజ్ కనెక్టివిటీ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో ఐకానిక్ స్టైల్ మరియు వైబ్రాంట్ కలర్ లలో కూడా అందిస్తోంది. ఈ బడ్స్ ను నాలుగు అందమైన కలర్ లలో లాంచ్ చేయబోతున్నట్లు కూడా మివి ప్రకటించింది.
Also Read: Motorola Razr 50: స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!
ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ MIVI Audio APP సపోర్ట్ తో వస్తుంది మరియు అడ్వాన్స్డ్ ఎక్వలైర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను పాకెట్ లో ఈజీగా క్యారీ చేయగలిగే డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. అయితే, ఈ బడ్స్ ధర ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఈ బడ్స్ ను బడ్జెట్ ధరలో కనుక లాంచ్ చేస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఇయర్ బడ్స్ కు భారీ కాంపిటీషన్ అవుతుంది.