MiVi Concerto: 5 ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన మివి.!

Updated on 05-Mar-2025
HIGHLIGHTS

మివి సూపర్ పోడ్స్ సిరీస్ నుంచి ఈరోజు కొత్త బడ్స్ కాన్సెర్టో ను లాంచ్ చేసింది

ఈ కొత్త బడ్స్ ను ఆకట్టుకునే 5 ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ బడ్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తాయి

MiVi Concerto: మివి సూపర్ పోడ్స్ సిరీస్ నుంచి ఈరోజు కొత్త బడ్స్ కాన్సెర్టో ను లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ను ఆకట్టుకునే 5 ఫీచర్స్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ బడ్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తాయి. మివి లేటెస్ట్ బడ్స్ కలిగిన ఆ 5 ఆకట్టుకునే ఫీచర్స్ మరియు ఈ బడ్స్ ప్రైస్ వివరాలు ఏమిటో చూసేద్దాం పదండి.

MiVi Concerto: ఫీచర్స్

మివి సూపర్ పోడ్స్ కాన్సెర్టో బడ్స్ ను ఫ్లాగ్ షిప్ లాంచ్ గా కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో 5 ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నట్లు కూడా మివి ప్రకటించింది. ఈ బడ్స్ మైక్రో టెక్స్చర్ద్ యూనీ బాడీ మెటల్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, మరింత క్రిస్టల్ క్లియర్ సౌండ్ కోసం ఈ బడ్స్ ను LDAC జతగా Hi-Res Audio Wireless సపోర్ట్ తో కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో థియేటర్ వంటి లీనమయ్యే సౌండ్ ఎక్స్ పీరియన్స్ ఈ బడ్స్ తో ఆస్వాదించవచ్చని మివి తెలిపింది.

మివి సూపర్ పోడ్స్ కాన్సెర్టో బడ్స్ లో గొప్ప 3D సౌండ్ స్టేజ్ సపోర్ట్ ఉందట. ఈ సపోర్ట్ తో అన్ని ప్రతీ వాయిద్యం క్లియర్ గా వినిపిస్తుంది, అని కూడా మివి చెబుతోంది. 35dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరియు క్వాడ్ మైక్ ANC సపోర్ట్ తో కూడా ఈ బడ్స్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్స్ తో ఈ బడ్స్ గొప్ప బయట రణగొణ ధ్వనులు చెవులకు లేదా అవతలి వైపు ఉన్న వారి కాలింగ్ కు అంతరాయం కలిగించవు, అని మివి పేర్కొంది. అంతేకాదు, ఈ బడ్స్ టోటల్ 60 గంటల ప్లే టైం అందించే గొప్ప బ్యాటరీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

మొత్తంగా, ఈ బడ్స్, Dolby Audio, 3D సౌండ్ స్టేజ్, LDAC, Hi-Res ఆడియో వైర్లెస్ మరియు ANC ఐదు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుందని మివి తెలిపింది.

Also Read: BSNL super Plan: నెలకు రూ. 100 కంటే తక్కువ ఖర్చుతో ఆల్ రౌండ్ బెనిఫిట్స్ అందించే ప్లాన్.!

MiVi Concerto: ప్రైస్

మివి ఈ కొత్త బడ్స్ ను రూ. 3,999 ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ఈరోజు Amazon మరియు అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :