ANC పై కూడా 70 గంటల ప్లే బ్యాక్ అందించే కొత్త Headphone లాంచ్ చేసిన Marshal.!

HIGHLIGHTS

ప్రపంచ ఆడియో ప్రొడక్ట్స్ దిగ్గజం Marshal కొత్త Headphone ను లాంచ్ చేసింది

మార్షల్ సిగ్నేచర్ సౌండ్ తో పాటు ANC పై కూడా 70 గంటల ప్లే బ్యాక్ అందించే సత్తాతో తీసుకు వచ్చింది

ఈ కొత్త హెడ్ ఫోన్ లో కస్టమైజ్ బటన్ వంటి మరిన్ని గొప్ప ఫీచర్స్ ను కూడా అందించింది

ప్రపంచ ఆడియో ప్రొడక్ట్స్ దిగ్గజం Marshal గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియాలో కూడా కొత్త Headphone ను లాంచ్ చేసింది. MONITOR III A.N.C. పేరుతో లాంచ్ చేసిన ఈ హెడ్ ఫోన్ ను మార్షల్ సిగ్నేచర్ సౌండ్ తో పాటు ANC పై కూడా 70 గంటల ప్లే బ్యాక్ అందించే సత్తాతో తీసుకు వచ్చింది. ఈ కొత్త హెడ్ ఫోన్ లో కస్టమైజ్ బటన్ వంటి మరిన్ని గొప్ప ఫీచర్స్ ను కూడా అందించింది.

Marshall MONITOR III A.N.C : ధర

మార్షల్ కొత్త MONITOR III A.N.C. హెడ్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త హెడ్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ధరలో విడుదల చేసింది. అయినా కూడా ఈ ధరలో ఈ హెడ్ వర్తబుల్ అనిపించే చాలా ఫీచర్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ హెడ్ ఫోన్ ను ఇండియాలో రూ. 29,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది.

Also Read: BSNL 4G: దేశవ్యాప్తంగా 35 వేల ప్రాంతాల్లో 4G సర్వీస్ అందుబాటులోకి తెచ్చిన బిఎస్ఎన్ఎల్.!

Marshall MONITOR III A.N.C: ఫీచర్స్

మార్షల్ ఈ కొత్త హెడ్ ఫోన్ ను 32mm డైనమిక్ డ్రైవర్స్ తో అందించింది. ఈ డ్రైవర్ 117 dB SPL (187 mV @ 1kHz) సెన్సిటివిటీ మరియు 35 Ω ఇంపిడెన్స్ ను కలిగి వుంది వుంది. ఈ స్పీకర్ లు 20-20,000 Hz ఫ్రీక్వెన్సీ రేంజ్ వస్తాయి. ఇది హెడ్ ఫోన్ మార్షల్ సిగ్నేచర్ సౌండ్ ను అందిస్తుంది. ANC పై 70 గంటలు లేదా రెగ్యులర్ యూసేజ్ మోడ్ పై 100 గంటల ప్లే బ్యాక్ ఈ హెడ్ ఫోన్ అందిస్తుంది.

ఈ మార్షల్ హెడ్ ఫోన్ 15 నిమిషాల ఛార్జ్ తో 2 గంటల ప్లే టైం అందించే క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ హెడ్ ఫోన్ లో Control knob, ANC-button మరియు ఈక్వలైజర్ కోసం M-button సపోర్ట్ ఉన్నాయి. ఇందులో సౌండ్ స్టేజ్ స్పెటియల్ ఆడియో టెక్నాలజీ అద్భుతమైన లిజనింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్ బ్లూటూత్ 5.3 LE సపోర్ట్ తో వస్తుంది. మార్షల్ అందించిన ఈ హెడ్ ఫోన్ ఎలా డైనమిక్ మరియు మంచి బ్యాలెన్స్డ్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :