lifelong launches 120 inch screen Smart Projector under 8k in India
తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ ను అందించే కొత్త Smart Projector వచ్చేసింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ప్రొజెక్టర్స్ అందిస్తున్న ప్రముఖ ఇండియన్ బ్రాండ్ Lifelong ఈ కొత్త ప్రోజెక్టర్ ని అందించింది. కేవలం 8 వేల ధరలో 120-inch ఇంచ్ స్క్రీన్ ను ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ అందిస్తుంది. ఇప్పుడు స్మార్ట్ టీవీ లతో పాటుగా స్మార్ట్ ప్రొజెక్టర్ లను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకే, యూజర్ల అవసరాలు మరియు కంఫర్ట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ప్రొజెక్టర్ ను తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
గత వారం లైఫ్ లాంగ్ కొత్త ఇండియన్ మార్కెట్ లో 4 కొత్త సార్ట్ ప్రొజెక్టర్ లను లాంఛ్ చేసింది.. వీటిలో 8 వేల ధరలో 120 ఇంచ్ స్క్రీన్ అందించే Lifelong Minipix స్మార్ట్ ప్రొజెక్టర్ కూడా వుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టార్ ను రూ. 8,499 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను HDFC Bank Debit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: Gold Market Update: ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగిన గోల్డ్ సూచీలు.!
లైఫ్ లాంగ్ యొక్క ఈ మిని స్మార్ట్ ప్రొజెక్టర్ చాలా చిన్నగా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అయితే, ఈ ప్రొజెక్టర్ 12 ఇంచ్ సైజు స్క్రీన్ ను మంచి క్వాలిటీతో అందిస్తుంది. ఈ ప్రొజెక్టర్ 1280 x 720 (Full HD) మరియు 4K కంటెంట్ కాంపేటిబిలిటీ ని కూడా కలిగి ఉంటుందట. ఇక ఈ ప్రొజెక్టర్ కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇది built-in Wi-Fi, Bluetooth 5.2 మరియు HDMI కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది.
ఈ ప్రొజెక్టర్ 360-Degree Rotation తో వస్తుంది మరియు కావాల్సిన చోట మీ స్క్రీన్ ను ఫోకస్ చేసే వీలుంటుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు Netflix, Prime Video, YouTube వంటి అనేక యాప్స్ కి సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే, మీరు రెగ్యులర్ గా చిన్న స్క్రీన్ టీవీ లలో చూసే పాటలు మరియు సినిమాలు ఈ ప్రొజెక్టర్ తో 120 ఇంచ్ సైజులో చూడవచ్చు.
ఈ చిన్న సైజు ప్రొజెక్టర్ లో రెండు ఇన్ బిల్ట్ స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.