LG Dolby Atmos today available with best deals on amazon
LG Dolby Atmos జబర్దస్త్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా ఆకట్టుకునే ఆఫర్లు అందించింది. డీప్ బాస్ మరియు ట్రిపుల్ అప్ ఫైరింగ్ స్పీకర్లతో గొప్ప సరౌండ్ అందించి ఇల్లు మొత్తం షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందించే ఈ ఎల్ జి సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తర్వాత కూడా లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ఎల్ జి ట్రిపుల్ అప్ ఫైరింగ్ సౌండ్ బార్ S77TY పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన 55% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 24,999 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అందుకున్న డిస్కౌంట్ తో పాటు రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఎల్ జి సౌండ్ బార్ ని Federal మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం 23,490 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: అండర్ రూ. 15,000 ధరలో లభించే బెస్ట్ 40 ఇంచ్ FHD QLED Smart Tv లు ఇవే.!
ఇది ఎల్ జి అందించిన 3.1.3 సెటప్ కలిగిన లేటెస్ట్ సౌండ్ బార్. ఇందులో మూడు అప్ ఫైరింగ్ మరియు ముందు మూడు స్పీకర్లు కలిగిన ట్రూ సరౌండ్ బార్ మరియు డీప్ బాస్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అందిస్తుంది మరియు మీ ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపేస్తుంది. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది మరియు మీ ఇంటికి గొప్ప లుక్ అందించే డెకరేషన్ గా కూడా కనిపిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS: X సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్, DTS డిజిటల్ సరౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI ఇన్ అండ్ అవుట్, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన Pass-through (4K) ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ Lg Thinq app సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.