itel T31 Pro budget anc buds launched along with buds ace
బడ్జెట్ ధరలో గొప్ప ప్రోడక్ట్స్ అను అందిస్తున్న ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ గా ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఐటెల్ ఈరోజు itel T31 Pro బడ్స్ ను ప్రకటించింది. ఈ బడ్స్ ను చాలా చవక ధరలో ANC ఫీచర్ మరియు గొప్ప డిజైన్ తో అందించింది. ఈ కొత్త బడ్స్ ను మార్కెట్ లో ప్రస్తుతం నడుస్తున్న చాలా ట్రెండీ ఫీచర్స్ మరియు ప్రత్యేకతలతో తీసుకువచ్చినట్లు ఐటెల్ తెలిపింది.
ఈ కొత్త ఇయర్ బడ్స్ ఐటెల్ టి31 ప్రో ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,499 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ బడ్స్ అన్ని రిటైలర్ షాప్ లలో లభిస్తాయని కంపెనీ తెలిపింది. అంతేకాదు, దీనితో పాటుగా బడ్స్ ఏస్ 2 ను కూడా ప్రకటించింది. ఈ బడ్స్ ను కేవలం రూ. 1,199 ధరతో విడుదల చేసింది. ఇది కూడా అన్ని ప్రధాన రిటైలర్ షాపుల్లో లభిస్తుంది.
ఐటెల్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ బడ్స్ ను 32db ANC సపోర్ట్ తో అందించింది. ఇందులో నార్మల్, ట్రాన్స్పరెన్సీ మరియు ANC మోడ్స్ ఉంటాయి. ఈ బడ్స్ లో 13mm బిగ్ స్పీకర్ లను డీప్, రిచ్ మరియు మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ కోసం అందించినట్లు ఐటెల్ తెలిపింది. ఈ కొత్త బడ్స్ 4 MIC AI ENC తో రణగొణ ధ్వనులను తగ్గించి మంచి కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా ఐటెల్ పేర్కొంది.
ఈ బడ్స్ లో బిగ్ బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉన్నట్లు కూడా చెప్పింది. ఇందులో, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ మరియు క్విక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ బ్యాకప్ వుంది. ఈ బడ్స్ గరిష్టంగా 45 గంటల ప్లే టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. అలాగే, మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ బడ్స్ 45ms తక్కువ జాప్యంతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 తో అంతరాయం లేని కనెక్టివిటీ అందిస్తుంది. ఈ ఐటెల్ టి31 ప్రో ఇయర్ బడ్స్ IPX5 వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో వస్తుంది.
Also Read: Realme Narzo N65: సైలెంట్ గా నార్జో సిరీస్ బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్.. ధర మరియు ఫీచర్లు ఇవే.!
ఇక బడ్స్ ఏస్ 2 విషయానికి వస్తే, ఈ బడ్స్ 10mm స్పీకర్ల ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో కూడా బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ మరియు AI ENC క్వాడ్ మైక్ సపోర్ట్ వుంది. ఈ బడ్స్ గరిష్టంగా 50 గంటలప్లే టైమ్ అందిస్తుంది మరియు 45ms లో లెటెన్సీ (తక్కువ జాప్యం) ఫీచర్ తో వస్తుంది. ఈ ఐటెల్ బడ్స్ కూడా IPX5 వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో వస్తుంది.