google launches Pixel Buds 2a with stunning price and features
గూగుల్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన పిక్సెల్ టెన్ స్మార్ట్ ఫోన్ లతో పాటు పిక్సెల్ బడ్స్ Pro 2 కొత్త కలర్ వేరియంట్ మరియు Pixel Buds 2a ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. క్రిస్టల్ క్లియర్ కాలింగ్ మొదలుకొని AI సపోర్ట్ వరకు ఈ బడ్స్ నేటి యువతరానికి కావాల్సిన అన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. గూగుల్ అందించిన ఈ లేటెస్ట్ ఇయర్ బర్డ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
గూగుల్ పిక్సల్ బడ్స్ 2a ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 12,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ త్వరలో సేల్ కి అందుబాటులోకి వస్తాయి. అయితే, ప్రస్తుతం ప్రీ ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఐరిష్ మరియు హాజెల్ రెండు రంగుల్లో లభిస్తుంది.
పిక్సల్ బడ్స్ 2a ఇయర్ బడ్స్ ను ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ గూగుల్ యొక్క A సిరీస్ బడ్స్ లో యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ కలిగిన మొదటి బడ్స్ గా నిలుస్తాయి. ఈ ఇయర్ బడ్స్ Tensor A1 ఆడియో ప్రోసెసర్ తో పని చేస్తాయి. ఈ బడ్స్ కస్టమ్ డిజైన్ తో అందించిన 11 mm డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటుంది. అంతేకాదు, చెవులకు మంచి రిలీఫ్ అందించే యాక్టివ్ ఇన్ ఇయర్ ప్రెజర్ రిలీఫ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కన్వర్జేషన్ డిటెక్షన్, ట్రాన్స్పరెన్సీ మోడ్, సైలెంట్ సీల్ 2.0 వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ బడ్స్ ఒకొక్క బడ్స్ లో రెండు మైక్రో ఫోన్స్ కలిగి గొప్ప కాలింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇది క్లియర్ కాలింగ్, బ్లూటూత్ సూపర్ వైడ్ బ్యాండ్, వాయిస్ యాగ్జలరో మీటర్ మరియు విండ్ బ్లాక్ మెస్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ గూగుల్ కొత్త బడ్స్ టోటల్ 27 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.
Also Read: ఆల్ న్యూ టెలిఫోటో లెన్స్ తో విడుదలైన Google Pixel 10 ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ బడ్స్ కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది IPX4 రేటింగ్ కలిగిన కేస్ ను మరియు IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగిన బడ్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ Gemini Live ఫీచర్ తో పూర్తి Ai సపోర్ట్ కలిగి ఉంటుంది. హెడ్ ట్రాకింగ్ తో కూడిన స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఈ బడ్స్ లో ఉంటుంది.