400W SONY Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 18 వేలకే లభిస్తోంది.!

Updated on 26-Dec-2025
HIGHLIGHTS

400W SONY Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది

ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది

400W SONY Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు పెద్ద డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం 18 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.

400W SONY Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

సోనీ 3.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ HT-G700 పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 39,990 రూపాయల ప్రైస్ తో వచ్చింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 20,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. BOB CARD EMI, HDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,499 రూపాయల సేల్ ప్రైస్ లో మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది.

Also Read: Redmi Pad 2 Pro 5G: భారీ 12,000 mAh బ్యాటరీ అండ్ డాల్బీ విజన్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

400W SONY Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఇది సోనీ అందించిన 3.1 చానల్ సౌండ్‌ బార్ మరియు ఇది మొత్తం 400W పవర్ అవుట్‌ పుట్ తో బలమైన బాస్ అండ్ క్లారిటీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో మూడు ఫ్రంట్ స్పీకర్లు మరియు సోనీ సిగ్నల్ ప్రాసెసింగ్ తో 3D వర్చువల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సెటప్ లో పవర్ ఫుల్ బాస్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటుంది. ఇది సినిమాల్లో డైలాగ్ స్పష్టంగా వినిపించేందుకు మంచి సెంటర్ స్పీకర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ లో వర్టికల్ సరౌండ్ సౌండ్ టెక్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఆడియో ఎన్ హెన్స్మెంట్ ఫీచర్ తో సాధారణ స్టీరియో సిగ్నల్‌ని 7.1.2 చానల్ సౌండ్ గా మార్చగలదు. అందుకే, ఇందులో మూడు స్పీకర్లు ఉన్నా కూడా గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ అన్ని ఫీచర్స్ కలగలిపి ఈ సౌండ్ బార్ మీకు సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI eARC, ఆప్టికల్, 4K HDR Pass-Through మరియు బ్లూటూత్ వంటి ఆల్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :