Flipkart Sale చివరి గంటల్లో భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే.!

Updated on 02-Oct-2025
HIGHLIGHTS

Flipkart Sale మరికొన్ని గంటల్లో ముగుస్తుంది

చివరి గంటల్లో ఇయర్ బడ్స్ పై బెస్ట్ డీల్స్ అందించింది

రెండు ఇయర్ బడ్స్ డీల్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి

Flipkart Sale మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. అందుకే కాబోలు చివరి గంటల్లో ఇయర్ బడ్స్ పై బెస్ట్ డీల్స్ అందించింది. వీటిలో రెండు ఇయర్ బడ్స్ డీల్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు బడ్స్ కూడా చాలా ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ధరలో లాంచ్ అయ్యాయి. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

Flipkart Sale : బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు అందించింది రెండు బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ విషయానికి వస్తే, ఈరోజు సేల్ నుంచి వన్ ప్లస్ మరియు మోటోరోలా ప్రీమియం బడ్స్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు ఇయర్ బడ్స్ కూడా మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటాయి మరియు ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తాయి.

moto buds+ Sound by Bose

బోస్ సౌండ్ సపోర్ట్ తో మోటోరోలా అందించిన మోటో బడ్స్ ప్లస్ ఇండియాలో రూ. 7,999 లాంచ్ అయ్యాయి. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 3,500 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ ను Axis ఫ్లిప్ కార్ట్ `డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ మోటోరోలా ఇయర్ బడ్స్ బోస్ సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 48dB ANC, డాల్బీ హెడ్ ట్రాకింగ్, డాల్బీ అట్మాస్, Hi-Res Audio Wireless, ట్రిపుల్ మైక్ సిస్టం మరియు IP54 వాటర్ రేపెళ్లేంట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ మోటో బడ్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 38 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.

Also Read: వివో ఫస్ట్ 200MP ఫోన్ Vivo V60e ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!

OnePlus Buds 3

వన్ ప్లస్ ఈ ప్రీమియం బడ్స్ ఇండియాలో రూ. 5,999 ధరతో లాంచ్ అయ్యాయి మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 2,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 ధరతో సేల్ అవుతోంది. ఈ బడ్స్ పై కూడా Axis ఫ్లిప్ కార్ట్ డెబిట్ కార్డ్ 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ డ్యూయల్ డ్రైవర్స్ కలిగి ఉంటుంది. అంటే, ఉఫర్ మరియు ట్వీటర్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 49dB ANC, LHDC 5.0 మరియు 10 మినిట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ బడ్స్ మంచి సౌండ్ అందించే ఇయర్ బడ్స్ లో ఒకటిగా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :