ఫ్లిప్ కార్ట్ బిగ్ ఆఫర్: 6 వేలకే 150W శామ్సంగ్ Dolby సౌండ్ బార్..!!
Flipkart సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది
150W బ్రాండెడ్ Dolby సౌండ్ బార్ ను తక్కువ ధరకే పొందవచ్చు
ఈ Samsung సౌండ్ బార్ హెవీ మరియు పంచ్ Bass సౌండ్ అందిస్తుంది
భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సౌండ్ బార్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. Flipkart సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి మంచి సౌండ్ అందించగల బ్రాండెడ్ Dolby సౌండ్ బార్ ను తక్కువ ధరకే పొందవచ్చు. అందుకే, ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న Samsung Dolby సౌండ్ బార్ డీల్ ను గురించి వివరాలను అందిస్తున్నాను. కేవలం 6 వేల రూపాయల ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించగల సత్తాకలిగిన ఈ సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ వివరాలు మరియు ఆఫర్లను గురించి క్రింద చూడవచ్చు.
SurveySAMSUNG HW-T42E/XL Dolby Digital 150 W బ్లూటూత్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 58% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ సౌండ్ బార్ కేవలం రూ.6,999 రూపాయలకే లభిస్తుంది. అంతేకాదు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. No Cost EMI వంటి ఇతర ఆకర్షణీయమైన అఫర్లు కూడా ఉన్నాయి. Buy From Here
ఈ సౌండ్ బార్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానెల్ సౌండ్ బార్ మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ హెవీ మరియు పంచ్ Bass సౌండ్ అందిస్తుంది మరియు సరౌండ్ సౌండ్ కూడా అఫర్ చేస్తుంది. దీనితో పాటుగా Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్నా ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు? అని మీరు అనుకోవచ్చు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు వున్నాయి.
మొదటిది, ఈ సౌండ్ బార్ లో HDMI Arc సపోర్ట్ లేదు. రెండవది ఈ సౌండ్ బార్ లో AUX పోర్ట్ కూడా లేకపోవడం. అయితే, ఈ సౌండ్ బార్ Optical (ఆప్టికల్) పోర్ట్ తో వస్తుంది మీ టీవీ లేదా సెటాప్ బాక్స్ లో ఆప్టికల్ పోర్ట్ ఉంటే దీని ద్వారా అద్భుతమైన Dolby సౌండ్ అందుతుంది. ఇక సింపుల్ అప్షన్ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మీ మొబైల్ లేదా టీవీ లకు కనెక్ట్ చేసుకోవచ్చు మరియు హెవీ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.
క్లియర్ గా చెప్పాలంటే, మ్యూజిక్ ని ఎక్కువగా ఇష్టపడే వారు ఒక హోమ్ థియేటర్ కొనే కంటే ఈ సౌండ్ బార్ ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఇది Deep Bass మరియు హెవీ సౌండ్ తో వస్తుంది మరియు కేవలం హోమ్ థియేటర్ ధరకే లభిస్తుంది. మీ టీవీలో Optical (ఆప్టికల్) పోర్ట్ ఉంటే మాత్రం ఇది బడ్జెట్ ధరలో మీకు Dolby Digital సౌండ్ ని అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile