గ్రౌండ్ షేక్ చేసే LG 800W 5.1 Soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!

Updated on 14-Feb-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ Valentine's sale నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ ను ఆఫర్ చేస్తోంది

LG యొక్క పవర్ ఫుల్ LG 800W Soundbar పై ఈ జబర్దస్త్ ఆఫర్ ను అందించింది

ఈ ఎల్ జి సౌండ్ బార్ DTS Virtual:X సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో వస్తుంది

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అందించిన Valentine’s sale నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG యొక్క పవర్ ఫుల్ LG 800W Soundbar పై ఈ జబర్దస్త్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ ఆఫర్ తో ఈ LG సౌండ్ బార్ ను కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం లభిస్తుంది.

ఏమిటా LG 800W 5.1 Soundbar ఆఫర్?

LG SH7Q సిరీస్ నుంచి అందించిన 5.1 ఛానల్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 68% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 17,990 ధరకే సేల్ అవుతోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,490 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.

Also Read: Valentine’s Day 2025: మీ ప్రియమైన వారికి షేర్ చేయదగిన బెస్ట్ విషెస్ మరియు ఇమేజస్.!

LG 800W 5.1 Soundbar : ఫీచర్స్

LG ఈ సౌండ్ బార్ ఐదు 3 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి 600W పవర్ ఫుల్ సౌండ్ అందించే బార్ మరియు 200W జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ BASS అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ LG సౌండ్ బార్ టోటల్ 800W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మెయిన్ యూనిట్ 8.6 కిలోలు మరియు సబ్ ఉఫర్ 5.3Kg బరువుతో చాలా సాలిడ్ గా ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Audio, AI Sound Pro మరియు DTS Virtual:X సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు HDMI Arc కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :