flipkart offers big deal on ZEBRONICS Dolby 5.1 soundbar
బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం వెతికే వారికి ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ నిజంగా చెప్పుకోదగినది. ఎందుకంటే, 10 వేల రూపాయల ధరలో వచ్చిన ఈ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తుంది. రెండు రోజుల క్రితం కూడా ఈ సౌండ్ బార్ రూ. 8,499 రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఇంకా చవక ధరలో లభిస్తుంది.
జెబ్రోనిక్స్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ Juke Bar 9400 Pro పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన డీల్స్ తో ఈ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై ఈ రోజు రూ. 78% భారీ డిస్కౌంట్ అందించి రూ. 7,999 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని కెనరా, BOB CARD, IDFC First, PNB మరియు SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 7200 రూపాయల అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించడం ఇదే ప్రధమం.
Also Read: Moto G57 5G స్మార్ట్ ఫోన్ Snapdragon 6s Gen 4 చిప్ తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ ఫీచర్ మరియు సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫులు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 525W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్డ్ స్పీకర్ సెటప్ తో ఉంటుంది. అయితే, ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ 5.1 ఛానల్ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది గొప్ప సరౌండ్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ తో సినిమా హాల్ తలపించే గొప్ప సౌండ్ అందిస్తుంది. AUX, ఆప్టికల్, USB, HDMI Arc మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు అధిక శాతం మంచి రివ్యూలు అందుకుంది.