Flipkart BBD Sale భారీ డీల్: 5 వేలకే 500W 5.1 Soundbar అందుకోండి.!

Updated on 13-Sep-2025
HIGHLIGHTS

Flipkart BBD Sale కంటే ముందే భారీ సౌండ్ బార్ డీల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది

బడ్జెట్ ధరలోనే 500W హెవీ సౌండ్ అందించే 5.1 Soundbar సొంతం చేసుకోవచ్చు

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము

Flipkart BBD Sale కంటే ముందే భారీ సౌండ్ బార్ డీల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లేటెస్ట్ సౌండ్ బార్ ఒకటి ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం Rs. 5,000 రూపాయల బడ్జెట్ ధరలోనే 500W హెవీ సౌండ్ అందించే 5.1 Soundbar సొంతం చేసుకోవచ్చు. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.

Flipkart BBD Sale 500W 5.1 Soundbar: ఆఫర్

GOVO ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 500W 5.1 ఛానల్ సౌండ్ బార్ GOSURROUND 950 ని ఈరోజు 74% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 ధరలో ఆఫర్ చేస్తోంది. Axis మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి రూ. 649 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 5,850 ధరకే అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రైస్ లో 500W హెవీ సౌండ్ అందించే బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది.

Also Read: MOTO Pad 60 Neo టాబ్లెట్ బడ్జెట్ ధరలో మోటో పెన్ మరియు 5G తో లాంచ్ అయ్యింది.!

GOVO 500W 5.1 Soundbar

ఈ GOVO సౌండ్ బార్ మూడు ఫ్రంట్ స్పీకర్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి టోటల్ 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ టోటల్ 500W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇది జాజ్, క్లాసిక్, పాప్, రిచ్ మరియు కౌంట్ ఐదు ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి యాంబియన్స్ కోసం LED లైట్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ Dolby లేదా DTS లాంటి సౌండ్ టెక్నాలజీ కలిగి ఉండకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. కానీ, ఈ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ మరియు మ్యూజిక్ వినడానికి గొప్పగా ఉంటుంది. ఇది హెవీ సౌండ్ అందిస్తుంది మరియు మంచి సరౌండ్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :