flipkart goat sale best dolby soundbar deals under rs 5000 today
ఈ నెల 12న మొదలైన ఫ్లిప్ కార్ట్ GOAT Sale రేపు రాత్రికి ముగుస్తుంది. చివరి రోజుకు చేరుకోవడంతో ఫ్లిప్ కార్ట్ మరిన్ని డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి కేవలం రూ. 5,000 రూపాయల బడ్జెట్ ధరలో బెస్ట్ Dolby Soundbar డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈరోజు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ లో మంచి డిస్కౌంట్ తో బెస్ట్ ఫీచర్స్ కలిగిన రెండు సౌండ్ బార్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు GOVO GOSURROUND 860 సౌండ్ బార్ మరియు Egate Enigma 315D రెండు సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి అందించిన ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ గోవో సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 72 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 5,499 ధరలో లభిస్తోంది. ఇది కాకుండా Axis, HDFC మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి రూ. 549 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,950 రూపాయల ధరకే లభిస్తుంది.
ఐకే ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ కలిగిన 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఇందులో బ్లూటూత్ 5.3, HDMI Arc, AUX, USB మరియు ఆప్టికల్ ఇన్ పుట్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Google Pixel 8a స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ GOAT Sale భారీ డిస్కౌంట్ ఆఫర్.!
ప్రముఖ స్మార్ట్ ప్రొజెక్టర్ తయారీ కంపెనీ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 62 శాతం భారీ డిస్కౌంట్ తో ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 5,999 ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను Axis, HDFC మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 599 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ఇందులో మరింత గొప్ప సౌండ్ కోసం DSP చిప్ కూడా అందించింది. ఇది కూడా 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 300W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI (eARC), ఆప్టికల్, USB మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ అందించింది.
ఈ రెండు సౌండ్ బార్స్ కూడా కూడా ఈరోజు ఫ్లిప్ సేల్ నుంచి కేవలం రూ. 5,000 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి మరియు మంచి సౌండ్ అందించే అన్ని వివరాలు కలిగి ఉంటాయి.