flipkart freedom sale offers boAt Dolby Soundbar at rs 3000 from sale
boAt Dolby Soundbar పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఫ్రీడమ్ సేల్ నుంచి జబర్దస్ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుకున్న డిస్కౌంట్ తో కేవలం రూ. 3,000 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. చవక ధరలో డాల్బీ ఆడియో సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
బోట్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన Aavante Bar 1150D పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ మార్కెట్లో రూ. 6,699 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా బోట్ అఫీషియల్ సైట్ నుంచి ఇదే ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి రూ. 2,900 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,799 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి. కేవలం 3 వేల రూపాయల ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ బోట్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
ఈ బోట్ సౌండ్ బార్ 2.0 ఛానల్ సెటప్ కలిగిన బార్ తో మాత్రమే వస్తుంది. ఈ సౌండ్ బార్ ఎటువంటి ఇతర స్పీకర్ లేదా ఉఫర్ కలిగి ఉండదు. అయితే, ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ ఫీచర్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు మెయిన్ స్పీకర్లతో కలిపి టోటల్ నాలుగు స్పీకర్లు కలిగి ఉంటుంది. సౌండ్ బార్ టోటల్ 80W సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Vivo T4 Pro ఫోన్ ను సూపర్ జూమ్ కెమెరాతో లాంచ్ చేస్తున్న వివో.!
సబ్ ఉఫర్ అవసరం లేకుండా స్మార్ట్ టీవీ సౌండ్ ను మరింత పెంచడానికి చవక ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి ఈ డీల్ బాగా సరిపోతుంది. ఈ సౌండ్ బార్ 3000 రూపాయల బడ్జెట్ లో డీసెంట్ సౌండ్ మరియు క్లారిటీ డైలాగ్స్ తో మంచి క్వాలిటీ సౌండ్ అందించే బార్ గా నిలుస్తుంది.