ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తున్న Panasonic Dolby Soundbar డీల్.!

Updated on 14-Aug-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2 ఈరోజు రెండో రోజుకు చేరుకుంది

ఈ సేల్ నుంచి ఈరోజు Panasonic Dolby Soundbar ను సగం ధరకే ఆఫర్ చేస్తోంది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2 ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. 15 ఆగస్టు సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రెండోసారి అందించిన ఈ సేల్ నుంచి ఈరోజు Panasonic Dolby Soundbar ను సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Panasonic Dolby Soundbar : డీల్

పానాసోనిక్ యొక్క SC-HTS400GWK సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 50% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,990 రూపాయల అతి తక్కువ ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ని Yes Bank, HSBC, HDFC మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,199 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,791 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.

Panasonic Dolby Soundbar : ఫీచర్స్

ఈ పానాసోనిక్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో సినిమా థియేటర్ వంటి కంప్లీట్ సరౌండ్ సెటప్ ఉంటుంది. ఇందులో, మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ పూర్తిగా టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా కలిగి వస్తుంది.

ఈ పానాసోనిక్ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో గొప్ప లుక్స్ తో ఉంటుంది. ఇది మెటాలిక్ గ్రిల్ మంచి మెటీరియల్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ పానాసోనిక్ సౌండ్ బార్ 20Hz-20KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేట్ కలిగి ఉంటుంది. అంటే, థియేటర్ వంటి డీప్ బాస్ గ్యారంటీ అన్నమాట. ఇందులో HDMI Arc, ఆప్టికల్, AUX ఇన్, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Also Read: Flipkart Sale నుంచి కేవలం 27 వేల ధరలో లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv ఇదే.!

ఇక ఈ సౌండ్ బార్ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, రూ. 10,000 రూపాయల బడ్జెట్ ధరలో లభించే డాల్బీ సౌండ్ డీల్స్ లో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :